‘సైరా’ రిలీజ్‌కి లైన్ క్లియర్.. వాళ్ళకు సినిమా చూపించక్కర్లేదు

0
3


సైరా సినిమా అఫీషియల్‌గా సెన్సార్ కార్యక్రమాలు కూడా జరుపుకుని రిలీజ్‌కి రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా కథపై ఉయ్యాలవాడ వంశస్థులు కేస్ వెయ్యడంతో ఏం జరుగుతుందో అన్న సందిగ్దత కొనసాగింది.కానీ ఫైనల్‌గా సైరా సినిమా రిలీజ్‌పై స్టే ఇవ్వడం కుదరదు అని తేల్చిచెప్పేసింది హై కోర్ట్.

ఆ సినిమా కథకి ఉపయోగపడే విషయాలు చెప్పినందుకు వాళ్లకు డబ్బులు ఇస్తాం అని లీగల్‌గా అగ్రిమెంట్ కూడా చేసి ఇప్పడు మాట మారుస్తున్నారు అని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసుల తరపున దొరవారి దస్తగిరి రెడ్డి హై కోర్ట్‌లో పిటిషన్ వేసాడు. అయితే ఆ కేస్‌పై వాదనలు సోమవారానికి వాయిదా పడ్డాయి. అయితే సైరా సినిమా రిలీజ్ ఆపాలని వేసిన పిటిషన్‌కి మాత్రం వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.

Also Read: ‘ఇంట్లోనే ఆయనతో వేగలేకపోతున్నా ఇక సినిమాల్లో కూడానా’

డబ్బులు ఇస్తాం అని చేసుకున్న అగ్రిమెంట్ సివిల్ కోర్ట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడ తేల్చుకోవాలని, దానివల్ల సినిమా ఆపడం కుదరదు అని తేల్చి చెప్పడంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులకు షాక్ తగిలినట్టయింది. అలాగే అది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయో పిక్ కాబట్టి అది ముందు వాళ్లకు చూపించాలి అని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ ఆ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాత్రం అది తాను రాసుకున్న స్వంత కథ అని కోర్ట్‌లో చెప్పాడు. కొన్ని అంశాల ఆధారంగా రాసుకున్న కథను బయోపిక్ అనలేమని కోర్ట్ అభిప్రాయపడింది. అయినా కూడా అందులో ఏవైనా తప్పులుకానీ, అభ్యంతరకర సన్నివేశాలు కానీ ఉంటే సినిమా రిలీజ్ అయిన తరువాత వాటిని మార్చాలి అని పిటిషన్ వేసుకోవచ్చని, అంతేకాని ముందు ఆ సినిమా చూపించాల్సిన అవసరం లేదు అని తీర్పు చెప్పింది.

Also Read: చిరు ప్రమోషన్స్ షురూ.. అమితాబ్‌తో ఛాయ్, చిట్ చాట్

ఇప్పటివరకు సైరా సినిమా విడుదలకు లాస్ట్ మినిట్‌లో ఏదైనా అడ్డంకి కలుగుతుందా అని భయపడిన మెగాఫ్యాన్స్ ఇప్పుడు ఊరట చెందుతున్నారు. సైరా అనుకున్న టైమ్‌కే థియేటర్స్‌లోకి వస్తుంది. ఇప్పటికే బాలీవుడ్‌‌లో ఈ సినిమాని ఒక రేంజ్‌లో ప్రొమోట్ చేస్తున్నారు చిరంజీవి. అమితాబ్ కూడా సైరా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడంతో ఇప్పటికే బాలీవుడ్ లో సైరా పై ఉన్న అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.మొత్తం ఇండియా వైడ్‌గా ఈ సినిమాని ప్రొమోట్ చెయ్యడానికి పూర్తి ప్లానింగ్ రెడీ‌గా ఉంది. ఇక అక్టోబర్ 2న థియేటర్స్‌లో సైరా విశ్వరూపం చూడడానికి పక్కాగా ఫిక్స్ అయిపోవచ్చు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here