‘సైరా’ హిందీ రైట్స్ సొంతం చేసుకున్న బాలీవుడ్ హీరో

0
5


రాయలసీమ పోరాట యోధుడు, తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అతిథి పాత్రలో నటించారు. నయనతార, తమన్నా, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, రవి కిషన్ లాంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో పాత్రలు పోషించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Also Read: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్.. ఈ ఏడాదికే అతిపెద్ద వేడుక..!

ఇదిలా ఉంటే, ‘సైరా’ను హిందీలో కూడా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీ విడుదల హక్కులను ప్రముఖ బాలీవుడ్ హీరో, నిర్మాత ఫర్హాన్ అక్తర్ కొనుగోలు చేశారు. ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానికి చెందిన ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్, అనిల్ తాదానికి చెందిన ఎఎ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ‘సైరా’ హిందీ హక్కులను కొనుగోలు చేశాయి. ఈ మేరకు ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ ట్వీట్ చేసింది. ‘సైరా’లోని పాత్రలను పరిచయం చేస్తూ ఒక వీడియోను కూడా షేర్ చేసింది.

ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న రెండో దక్షిణాది సినిమా ‘సైరా’. గతంలో కన్నడ బ్లాక్ బస్టర్ ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ను ఫర్హాన్ అక్తర్ హిందీలో విడుదల చేశారు. ఈ చిత్రం కోట్లు తెచ్చిపెట్టింది. మరి ఇప్పుడు ‘సైరా’ వారికి ఏ స్థాయిలో లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలి. అయితే, ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్, ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వాని, ఎఎ ఫిల్మ్స్‌తో అసోసియేట్ కావడం చాలా ఆనందంగా ఉందని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్వీట్ చేసింది.

కాగా, బ్రిటిష్ రాజ్యంపై కర్నూలు ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు. ఇక అవుకు రాజుగా సుదీప్ నటించారు. రాజా పాండిగా విజయ్ సేతుపతి, లక్ష్మిగా నయనతార, రాణి సిద్ధమ్మగా నయనతార ప్రేక్షకులను అలరించనున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here