సొమ్ము భద్రం: LIC ఆర్థిక పరిస్థితి బాగాలేదా? నిజమేంటో తెలుసుకోండి!

0
4


సొమ్ము భద్రం: LIC ఆర్థిక పరిస్థితి బాగాలేదా? నిజమేంటో తెలుసుకోండి!

న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికలపై జరుగుతున్న ప్రచారంపై ఎల్ఐసీ స్పందించింది. సంస్థ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏమాత్రం నమ్మవద్దని, గత కొద్ది రోజులుగా తప్పుడు ప్రచారం చేయడంతో పాటు వదంతులు వినిపిస్తున్నాయని, పాలసీదార్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది.

ఎల్ఐసీ బ్రాండ్ దెబ్బతీసేందుకు…

తప్పుడు ప్రచారాలు, వదంతులు పాలసీదార్లను తప్పుదోవ పట్టించే విధంగా ఉండటంతో పాటు వారిని ఎంతో ఆందోళనకు గురిచేస్తున్నాయని ఎల్ఐసీ పేర్కొంది. ఇలాంటి వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది. ఎల్ఐసీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు, పాలసీదార్లలో ఆందోళన రేకెత్తించేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా జరుగుతున్నట్లుగా తన ప్రకటనలో తెలిపింది. ఎల్ఐసీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని పేర్కొంది.

ఎల్ఐసీ ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగు

ఎల్ఐసీ ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగు

ఇలాంటి అర్థంపర్థంలేని వదంతుల ఆధారంగా పాలసీదారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కూడా ఎల్ఐసీ కోరింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చింది. ఎల్ఐసీ ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని తెలిపింది. ‘సంస్థ ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుందని పాలసీహోల్డర్లకు ఎల్ఐసీ హామీ ఇస్తోంది’ అని ప్రకటనలో భరోసా ఇచ్చింది.

రూ.50,000 కోట్లకు పైగా బోనస్

రూ.50,000 కోట్లకు పైగా బోనస్

2018-19 ఆర్థిక సంవత్సరంలో పాలసీహోల్డర్లకు గతంలో ఎన్నడూలేని విధంగా రూ.50,000 కోట్లకు పైగా బోనస్ ప్రకటించినట్లు తెలిపింది. 2019 ఆగస్ట్ 31 నాటికి పాలసీపరంగా ఎల్ఐసీ మార్కెట్ వాటా 72.84 శాతంగా ఉందని తెలిపింది. మొదటి ప్రీమియం వసూల్లలో 73.06 శాతంగా ఉందని పేర్కొంది. ఈ ఏడాది మార్చి చివరినాటికి మొదటి ఏడాది ప్రీమియంపరంగా మార్కెట్ వాటా 66.24 శాతం ఉండగా, ఆగస్ట్ 31 నాటికి 73.06 శాతానికి పెరిగిందని గుర్తు చేసింది.

ఎల్ఐసీ పరిస్థితి ఏమిటి?

ఎల్ఐసీ పరిస్థితి ఏమిటి?

ఎల్ఐసీ మార్కెట్ శాతం ఏప్రిల్ – ఆగస్ట్ నాటికి ఇయర్ టు ఇయర్ విధంగా 3.34 శాతం పెరిగిందని తెలుస్తోంది. ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (IRDAI) డాటా ప్రకారం ఎల్ఐసీ ఏప్రిల్ – ఆగస్ట్ పీరియడ్‌లో ఎల్ఐసీ రూ.77,220.97 కోట్లు కలెక్ట్ చేసింది. ఇయర్ టు ఇయర్ గ్రోత్ శాతం 46.52. ఇదే సమయంలో గత ఏడాది రూ.52,701.86 కోట్లు కలెక్ట్ చేసింది.

గట్టి పోటీ ఉన్నప్పటికీ...

గట్టి పోటీ ఉన్నప్పటికీ…

ప్రయివేటు బీమా కంపెనీల నుంచి ఎల్ఐసీ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. అయితే ఐదు నెలల్లో వాటి మార్కెట్ విలువ 30.28 శాతం నుంచి 26.94 శాతానికి పడిపోయింది. అదే సమయంలో స్టాక్ మార్కెట్లో కూడా ఎల్ఐసీ షేర్లు కొన్ని త్రైమాసికాల్లో అస్థిరతను చూసినప్పటికీ గత మూడేళ్లలో ఈక్విటీ హోల్డింగ్ వ్యాల్యూ 62.7 శాతం పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యాల్యూ రూ.74,781 కోట్లుగా ఉంది. ఎల్ఐసీ అతిపెద్ద ఫైనాన్షియల్ సంస్థ. కాబట్టి ఈక్విటీలు, రుణ మార్కెట్లలో ట్రిలియన్ల కొద్ది రూపాయల పెట్టుబడిదారీగా ఉంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here