సోంపూర్‌ శివారులో చిరుత సంచారం

0
1


సోంపూర్‌ శివారులో చిరుత సంచారం

భయాందోళనలో గ్రామస్థులు

చిరుత పాదముద్రలను పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు

కోటగిరి, న్యూస్‌టుడే: సోంపూర్‌ గ్రామ శివారులో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు తమ పంట పొలానికి వెళ్తుండగా చిరుత జింకను వేటాడడం గమనించారు. ఈ విషయాన్ని గ్రామస్థులకు చెప్పడంతో ఎవరూ నమ్మలేదు. సర్పంచి బాగ్యలక్ష్మి, స్థానిక నాయకులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దాంతో అధికారులు గురువారం గ్రామాన్ని సందర్శించారు. చిరుత సంచరించిన ప్రాంతానికి చేరుకొన్నారు. కొన్ని పాదముద్రలను సేకరించారు. హున్సా, మందర్న, సోంపూర్‌ మంజీర పరివాహక గ్రామాలు కావడంతో ఈ ప్రాంతాల్లో జింకల సంచారం అధికంగా ఉంటుంది. మంజీర అవతలి వైపున్న మహారాష్ట్ర ప్రాంతం నుంచి చిరుత వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. గ్రామస్థులు ఎవరూ ఒంటరిగా తిరగరాదని, ఎక్కడికైనా వెళ్తే నలుగురైదుగురు కలిసి గుంపుగా వెళ్లాలని అధికారులు సూచించారు. రాత్రివేళల్లో టపాసులు కాల్చుతూ శబ్దాలు చేస్తే పారిపోయే ఆస్కారం ఉందన్నారు. చిరుత ఏ క్షణంలో గ్రామస్థులపై దాడి చేస్తుందోనని చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ సెక్షన్‌ అధికారి బాసీద్‌, బీట్‌ అధికారి శివ, ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ విఠల్‌, ఎంపీడీవో అత్తారుద్దీన్‌, ఎస్సై రవీందర్‌, తదితరులు పర్యవేక్షించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here