సోమవారం ఆశ్రమ పాఠశాల భవన ప్రారంభోత్సవం

0
2



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11వ తేదీ సోమవారం కామారెడ్డి జిల్లా నసురల్లాబాద్‌ మండల కేంద్రంలో రూ. 4.20 కోట్లతో నిర్మించిన ఎస్‌టి గురుకుల ఆశ్రమ పాఠశాల నూతన భవనాన్ని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రారంభిస్తారని ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం ఉంటుందని నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here