సౌదీ అరేబియా ఎఫెక్ట్, నష్టాల్లో మార్కెట్లు

0
4


సౌదీ అరేబియా ఎఫెక్ట్, నష్టాల్లో మార్కెట్లు

ముంబై: భారత మార్కెట్లు సోమవారం నాడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సౌదీ అరేబియాలోని ఆరామ్‌కో చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడి నేపథ్యంలో ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 13 శాతం వరకు పెరిగాయి. దీంతో మన మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.

ఉదయం గం.9.40 నిమిషాలకు సెన్సెక్స్ 266 పాయింట్లు నష్టపోయి 37,118 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 10,992 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం గం.12.00 సమయానికి సెన్సెక్స్ 158.04 (0.42%) శాతం తగ్గి 37,226.95 వద్ద ట్రేడ్ కాగా, నిఫ్టీ 47.70 (0.43%) కోల్పోయి 11,028.20 వద్ద ట్రేడ్ అయింది.డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.58 వద్ద ట్రేడ్ అయింది.

నిఫ్టీలో… ONGC 2.44%, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 2.36%, GAIL 1.78%, టెక్ మహీంద్రా 0.75%, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ 0.75% లాభపడగా, భారత్ పెట్రోలియం 5.52%, ఇండియన్ ఆయిల్ 2.77%, ఆసియన్ పేయింట్స్ 2.19%, భారతి ఇన్ఫ్రాటెల్ 1.83%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.64% నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

సెన్సెక్స్‌లో ONGC 2.29%, టెక్ మహీంద్రా 0.80%, టీసీఎస్ 0.74%, హిందూస్తాన్ యూనీలివర్ 0.73%, సన్ ఫార్మా 0.53% లాభాల్లో ట్రేడ్ కాగా, ఆసియన్ పేయింట్స్ 2.31%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.49%, హెచ్‌డీఎఫ్‌సీ 1.34%, టాటా మోటార్స్ 1.08%, మారుతీ సుజుకీ 0.97% నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here