సౌదీ ఆరామ్‌కో‌తో కీలక ఒప్పందాలు! జీరో డెబిట్ కంపెనీగా రిలయన్స్!

0
1


సౌదీ ఆరామ్‌కో‌తో కీలక ఒప్పందాలు! జీరో డెబిట్ కంపెనీగా రిలయన్స్!

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ (RIL) గత ఏడాది అత్యధిక లాభాలు ఆర్జించి రికార్డ్ సృష్టించిందని ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ సోమవారం (ఆగస్ట్ 12) చెప్పారు. రిలయన్స్ రిటైల్ లక్షా 30వేల కోట్ల బిజినెస్ చేసిందని, భారత ఆర్థిక వ్యవస్థలో రిలయన్స్ భాగస్వామ్యం అన్నారు. 42వ యాన్యువల్ జనరల్ మీటింగ్ (AGM)సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం, సౌదీ ఆరామ్‌కో కంపెనీ పెట్టుబడుల వివరాలను వెల్లడించారు.

62,320 కోట్ల జీఎస్టీ

దేశంలో అత్యధిక పన్నులు చెల్లించింది తమ కంపెనీయే అని ముఖేష్ అంబానీ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 67,320 కోట్ల జీఎస్టీ కట్టినట్లు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డిజిటల్ ప్లాట్ ఫాంగా రిలయన్స్ జియో ఎదిగిందన్నారు. ఇప్పటికే జియో కస్టమర్ల సంఖ్య 340 మిలియన్లు దాటిందన్నారు. 2030 నాటికి భారత్ 10 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు.

20 శాతం వాటాల కోసం ఆరామ్‌కో పెట్టుబడి

20 శాతం వాటాల కోసం ఆరామ్‌కో పెట్టుబడి

సౌదీ అరేబియాకు చెందిన సౌదీ ఆరామ్‌కోతో ఒప్పందం అనంతరం రిలయన్స్ రిఫైనరీకి ఆ కంపెనీ రోజుకు 5,00,000 బ్యారెల్స్ క్రూడాయిల్ సరఫరా చేస్తుందని తెలిపారు. తమ కంపెనీలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేందుకు ఆ కంపెనీతో ఒప్పందం కుదిరిందన్నారు. రిలయన్స్ ఆయిల్ టు డివిజన్‌లో సౌదీ ఆరామ్‌కో ఇరవై శాతం వాటాల కోసం పెట్టుబడులు పెడుతుందన్నారు. విదేశీ ప్రత్యక్, పెట్టుబడుల్లో ఇదే అతిపెద్ద భాగస్వామ్యమని తెలిపారు.

18 నెలల్లో రుణరహిత కంపెనీగా...

18 నెలల్లో రుణరహిత కంపెనీగా…

రానున్న 18 నెలల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రుణరహిత కంపెనీగా చేసేందుకు రోడ్ మ్యాప్ తయారు చేశామని ముఖేష్ అంబానీ వెల్లడించారు. సౌదీ ఆరామ్‌కో, BPలతో ఒప్పందాలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాల వల్ల రూ.1.15 లక్షల కోట్లు కంపెనీలోకు వస్తాయన్నారు. రిలయన్స్ తన ఫ్యూయల్ రిటైల్ వ్యాపారంలోని 49 శాతం వాటాలను BPకి విక్రయించడం ద్వారా రూ.7,000 కోట్లు సేకరిస్తుందన్నారు. మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం ద్వారా డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి స్టార్టప్స్‌కు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు ఉచితంగా అందిస్తామన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here