స్కిల్ డెవలప్‌మెంట్: ఫ్లిప్‌కార్ట్ శిక్షణ, 20,000 మందికి శిక్షణ

0
3


స్కిల్ డెవలప్‌మెంట్: ఫ్లిప్‌కార్ట్ శిక్షణ, 20,000 మందికి శిక్షణ

న్యూఢిల్లీ: వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్ నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (NSDC)కు చెందిన లాజిస్టిక్స్ స్కిల్ కౌన్సెల్ (LSC)తో చేతులు కలిపింది. ఇందులో భాగంగా తమ కంపెనీకి చెందిన 20,000 మంది డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు ట్రెయినింగ్ ఇప్పిస్తున్నారు. కస్టమర్లతో ప్రోడక్ట్ డెలివరీ, ఇంటరాక్షన్, ట్రాన్స్‌పోర్టేషన్ చట్టాలు, సప్లై చైన్, ఆయా నగరాల నిబంధనల గురించి శిక్షణ ఇప్పిస్తోంది.

లాజిస్టిక్స్ సెక్టార్స్ స్కిల్ కౌన్సెల్‌తో ఒప్పందం తొలిసారి

ఓ ఈ-కామర్స్ కంపెనీకి లాజిస్టిక్స్ సెక్టార్స్ స్కిల్ కౌన్సెల్‌కు మధ్య ఒప్పందం ఇదే తొలిసారి. శిక్షణ పూర్తయిన అనంతరం నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ ప్రకారం సర్టిఫికెట్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ సర్టిఫికెట్ అందిస్తారు. LSCతో కలిసి ఫ్లిప్‌కార్ట్ తమ ఉద్యోగులకు ఎనిమిది గంటల ట్రెయినింగ్ శిక్షణ ఇస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో శిక్షణ ప్రారంభం కాగా, 4,000 మంది ట్రెయిన్ అయ్యారు.

స్కిల్డ్ మ్యాన్ పవర్ సవాల్‌గా మారింది..

స్కిల్డ్ మ్యాన్ పవర్ సవాల్‌గా మారింది..

నైపుణ్యం కలిగిన మ్యాన్ పవర్ అసలైన సవాల్‌గా మారింది. ముఖ్యంగా లాజిస్టిక్ రంగంలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది కేవలం సహాయక పరిశ్రమగానే చూస్తున్నారు. డెలాయిట్ – అసోచోం 2018 నివేదిక ప్రకారం సరైన శిక్షణలేకపోవడం, సరైన లీడర్‌షిప్ లేకపోవడం, సాఫ్ట్ స్కిల్స్ కోసం, ఆపరేషనల్, టెక్నికల్ ట్రెయినింగ్ కోసం పరిమిత సంఖ్యలో సంస్థలు ఉండటమే తక్కువ స్కిల్స్‌కు కారణమని వెల్లడించింది.

24 సెక్టార్‌లలో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అవసరం

24 సెక్టార్‌లలో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అవసరం

ప్రపంచబ్యాంకు ప్రకారం భారతదేశంలో కేవలం 2.3 శాతం మాత్రం మాత్రమే (2015లో 503.8 మిలియన్లు) అధికారిక నైపుణ్య శిక్షణ కలిగి ఉన్నారు. 2022 నాటికి ఆర్థిక వ్యవస్థలోని 24 కీలక సెక్టార్‌లలో 109 మిలియన్ల మంది స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అవసరమని గవర్నమెంట్ స్కిల్స్ గ్యాప్ అనాలసిస్ వెల్లడిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, LSC మాడ్యూల్ సప్లై చైన్ వర్క్ ఫోర్స్ నైపుణ్యతను పెంపొందించేందుకు సహాయపడుతుందని ఎకార్ట్ సీనియర్ వీపీ అమితేష్ ఝా అన్నారు.

గ్రాసరీస్ పైనా ఫ్లిప్‌కార్ట్ దృష్టి

గ్రాసరీస్ పైనా ఫ్లిప్‌కార్ట్ దృష్టి

ఇదిలా ఉండగా, ఫ్లిప్‌కార్ట్ రానున్న అయిదేళ్లలో గ్రాసరీ సెగ్మెంట్‌లో భారతదేశవ్యాప్తంగా టయర్ II, టయర్ III నగరాల్లోను సేవలను విస్తరించాలని యోచిస్తోంది. ప్రస్తుతం ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్ నగరాల్లో గ్రాసరీస్‌ను డెలివరీ చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సూపర్‌మార్ట్ ద్వారా వీటిని అందిస్తోంది. ప్రస్తుతం గ్రాసరీస్ మార్కెట్ 400 బిలియన్ డాలర్లుగా ఉంది. భారతదేశంలో ఇది అతిపెద్ద మార్కెట్. కానీ గ్రాసరీ సెక్షన్‌లో ఆన్‌లైన్ వ్యాప్తి మాత్రం కేవలం 1 శాతం మాత్రమే ఉంది. దీంతో ఈ-కామర్స్ దిగ్గజాలు గ్రాసరీస్ పైన ప్రధానంగా దృష్టి సారించాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here