స్టార్టప్ కంపెనీలకు బూస్టర్ డోస్…. కానీ!

0
0


స్టార్టప్ కంపెనీలకు బూస్టర్ డోస్…. కానీ!

దేశంలో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అనేక సానుకూల నిర్ణయాలు తీసుకొంటోంది. ఇందులో భాగంగా తాజాగా మరో అనుకూల నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో స్టార్టుప్ కంపెనీలకు సరి కొత్త బూస్టర్ డోస్ లభించినట్లయింది. కొత్త నిర్ణయాల్లో ఒకటి స్వెట్ ఈక్విటీ పెంపు కాగా… మరోటి రేగులటరీ ఫైలింగ్స్ నుంచి 10 ఏళ్ళ వరకు మినహాయింపు ఇవ్వటం. ఈ రెండు కూడా చాలా ప్రోత్సహకారమైన నిర్ణయాలే అయినప్పటికీ…. వాటిలో పూర్తిస్థాయి స్పష్టత లోపించటంతో అసలు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది.

ఇదొక్కటేనే కాదు, ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొన్న అనేక నిర్ణయాల్లో ఇలాంటి ఇబ్బందులు నెలకొంటున్నాయని స్టార్టుప్ కంపెనీల ఫౌండర్లు వాపోతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. అయితే, ప్రస్తుత చర్యలతో స్టార్టుప్ కంపెనీలకు నిర్వహణ పరంగా, నిబంధనల పరంగా కొంత ఊరట లభించనుంది. ఆర్థికంగానూ కంపెనీలకు కొంత వెసులుబాటు లభించనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

50% వరకు స్వెట్ ఈక్విటీ …

స్టార్టుప్ కంపెనీల్లో స్వెట్ ఈక్విటీ పరిమితిని ప్రభుత్వం భారీగా పెంచింది. దీనిని ఏకంగా కంపెనీ పేడ్ అప్ కాపిటల్ లో 50% వరకు అనుమతించనుంది. దీంతో స్టార్టుప్ ఫౌండర్లు కేవలం పెట్టుబడి మాత్రమే కాకుండా వారు పడిన కష్టానికి తగినట్లు అదనపు వాటాను పొందేందుకు వీలు చిక్కుతుంది. ఉదాహరణకు ఒక స్టార్టుప్ కంపెనీని ఇద్దరు మిత్రులు కలిసి స్థాపించారు. ఒకరి వద్ద పెట్టుబడి ఉండగా మరొకరి వద్ద అది లేదు. కానీ ఆ రెండో వ్యక్తి టెక్నాలజీ లో జెమ్. ఆయన పెట్టుబడికి బదులు తన టెక్నాలజీ ఎక్సపెర్టిజ్ ను కంపెనీలో పెట్టుబడిగా పెట్టవచ్చు. అంటే అతను పనిచేసే పనికి వేతనం బదులు దానిని పెట్టుబడి కింద బదలాయించవచ్చు. దీంతో ఇద్దరికీ మేలు జరుగుతుంది. కంపెనీ కూడా వృద్ధి లోకి వస్తుంది. స్వెట్ ఈక్విటీ కేవలం ప్రోమోటర్ల కు మాత్రమే కాకుండా కంపెనీలో కీలక పాత్ర పోషించే ఉద్యోగులకు కూడా వర్తింప చేయవచ్చు. తద్వారా ఉద్యోగులను ఎక్కువ కాలం కంపెనీ కోసం పనిచేసేలా చూడవచ్చు.

10 ఏళ్ళు అవసరం లేదు..

10 ఏళ్ళు అవసరం లేదు..

స్టార్టుప్ కంపెనీలు అంటేనే … అన్నీ కష్టాలే. మొదట పెట్టుబడి సమీకరణ కష్టం. సరైన ఉద్యోగులు దొరకటం కష్టం. ఆ పైన ప్రభుత్వ పరమైన రేగులటరీ ఫైలింగ్స్. పెద్ద కంపెనీలు, బాగా స్థిరపడిన సంస్థలు వీటిని తూచా తప్పక పాటిస్తాయి. కానీ అప్పుడే పురుడు పోసుకొనే స్టార్టుప్ కంపెనీలకు సమయానికి రేగులటరీ ఫైలింగ్స్ చేసే స్థోమత ఉండదు. దీన్ని సరిగ్గా గుర్తించిన ప్రభుత్వం… స్టార్టుప్ కంపెనీలకు 10 ఏళ్ళ వరకు రేగులటరీ ఫైలింగ్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. కానీ ప్రభుత్వం దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వలేదు. ఎలాంటి రేగులటరీ ఫైలింగ్స్ నుంచి మినహాయింపు ఇస్తుందో, వేటికి ఇది వర్తించదో తెలుపలేదు. ఈ మేరకు స్పష్టత ఉంటె బాగుండేదని స్టార్టుప్ కంపెనీలకు సలహాలు ఇచ్చే మెంటార్స్ అభిప్రాయపడుతున్నారు.

కొత్త కొలువులు...

కొత్త కొలువులు…

ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఒకటని కాకుండా దాదాపు అన్ని రంగాల్లో నూ ఉద్యోగాలు పోతున్నాయి. కానీ ఒక్క స్టార్టుప్ కంపెనీల విభాగంలో మాత్రమే ఉద్యోగాల కల్పనకు వీలుంది. ఎందుకంటే, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మార్కెట్ పరిస్థితుల కంటే కూడా వారి ఐడియా ను మార్కెట్లో ప్రవేశ పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అందుకోసం అహో రాత్రులు కష్టపడతారు. అందుకే, వారు తమ స్టార్టుప్ కంపెనీకి అవసరమైన ఉద్యోగులను నియమించుకొంటారు. ఇలాంటి సమయంలో అటు ప్రభుత్వం నుంచి మినహాయింపులు లభిస్తే అది తప్పని సరిగా మరింత అధిక సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుంది. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఎంతైనా అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.

వేలల్లో కొత్త కంపెనీలు...

వేలల్లో కొత్త కంపెనీలు…

ప్రపంచంలోనే స్టార్టుప్ కంపెనీలను నెలకొల్పటంలో భారత దేశం చాలా ముందు ఉంది. అమెరికా, చైనా తర్వాత ఇండియా మూడో స్థానంలో నిలుస్తోంది. మన దేశంలో ఇప్పటికే సుమారు 32,000 కు పైగా స్టార్టుప్ కంపెనీలు వివిధ రంగాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. వచ్చే 5-6 ఏళ్లలో సుమారు 50,000 పైగా స్టార్టుప్ కంపెనీలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. సగటున ఒక్కో కంపెనీ 10 మందికి ఉపాధి కల్పించినా … లక్షల్లో కొత్త వారికి ఉపాధి లభించటం ఖాయం అని విశ్లేషకులు చెబుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here