స్టీవ్ స్మిత్‌కు సరైన మొగుడు అతడే!

0
2


హైదరాబాద్: ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన పేసర్ జోఫ్రా ఆర్చర్ టెస్టు అరంగే ట్రానికి మార్గం సుగమమైంది. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా రెండో టెస్టు లార్డ్స్ వేదికగా ఆగస్టు 14న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఈ టెస్టులో జోఫ్రా ఆర్చర్ బరిలో దిగడం దాదాపు ఖాయమైంది. రెండో టెస్టుకు ముందే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గాయం కారణంగా ఆటకు దూరమైన అండర్సన్ స్థానంలో జోఫ్రా ఆర్చర్‌ను ఎంపిక చేసింది.

ఆఖరి బంతికి సిక్స్: 55 బంతుల్లో సెంచరీ, టీ20 బ్లాస్ట్‌లో బాబర్ అజాం రికార్డు

రెండో టెస్టులో జోప్రా ఆర్చర్‌కు చోటు

రెండో టెస్టులో జోప్రా ఆర్చర్‌కు చోటు

ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌ తొలి టెస్టులోనే జోఫ్రా ఆర్చర్ చోటు దక్కించుకున్నప్పటికీ.. చిన్నపాటి గాయం కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకోలేపోయాడు. అయితే సెకండ్ ఎలెవన్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లిష్‌ కౌంటీ జట్టు ససెక్స్‌ తరఫున ఆడిన జోఫ్రా ఆర్చర్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో చెలరేగిన ఆర్చర్‌.. బ్యాటింగ్‌లో సెంచరీతో ఆకట్టుకున్నాడు.

స్మిత్‌ను నిలువరించాలంటే

స్మిత్‌ను నిలువరించాలంటే

దీంతో ఆర్చర్ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడంతో రెండో టెస్టు కోసం ప్రకటించిన 12 మంది సభ్యులతో ప్రకటించిన జట్టులో ఆర్చర్‌ తిరిగి చోటు దక్కించుకున్నాడు. దీంతో యాషెస్ టెస్టు సిరిస్‌లో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రెండు సెంచరీ సాధించిన స్టీవ్ స్మిత్‌ను నిలువరించాలంటే ఆర్చర్‌ను రంగంలోకి దింపాలన్నాడు.

రెండు మూడు పదవులుంటే తప్పేంటి?: ద్రవిడ్‌కు మద్దతుగా కుంబ్లే

ఆర్చర్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం

ఆర్చర్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం

ప్రస్తుతం జోఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమని ఆస్ట్రేలియా స్పిన్న లెజెండ్ షేన్ వార్న్‌ అభిప్రాయపడ్డాడు. షేన్ వార్న్ మాట్లాడుతూ “స్మిత్‌ను నిలువరించే ప్రణాళిక ఆర్చర్‌ వద్ద కచ్చితంగా ఉంటుంది. సుమారు 145 కి.మీ వేగంతో బంతుల్ని ఆర్చర్‌ సంధిస్తున్నాడు. ఆర్చర్‌ సవాల్‌ను స్మిత్‌ ఎదుర్కోవడం కష్టమే. రెండో టెస్టుకు అండర్సన్‌ దూరమయ్యాడు. దాంతో ఆర్చర్‌ అవసరం ఇంగ్లాండ్‌కు ఉంది” అని అన్నాడు.

స్టేడియంలోని అద్దాలను పగలగొట్టిన షోయబ్ మాలిక్ (వీడియో)

ఐపీఎల్‌లో ఇద్దరూ రాజస్థాన్ రాయల్స్‌కు

ఐపీఎల్‌లో ఇద్దరూ రాజస్థాన్ రాయల్స్‌కు

“ఆర్చర్ బౌలింగ్‌ను ఇప్పటికే స్మిత్ ఎదుర్కొన్నాడు. అంతకముందు స్మిత్‌-ఆర్చర్‌లు ఇద్దరూ ఒకే నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశారు. ఐపీఎల్‌లో ఇద్దరూ రాజస్థాన్ రాయల్స్‌కు ఆడారు. దీంతో స్మిత్‌ ఆట తీరుపై ఆర్చర్‌కు ప్రణాళిక ఉంటుంది. ఆర్చర్‌ ఎక్స్‌ట్రా పేస్‌తో బ్యాట్స్‌మెన ఇబ్బందులు పెడతాడు. దాంతో పాటు అతని బౌలింగ్‌లో వేగం కూడా నియంత్రణలో ఉంటుంది. యాషెస్‌లో మంచి ఫామ్‌లో ఉన్న స్మిత్‌ను ఆపాలంటే ఆర్చర్‌ సరైనవాడు” అని షేన్ వార్న్ తెలిపాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here