స్త్రీ జీవితంలో ఆ ప్రక్రియ సహజం

0
2


స్త్రీ జీవితంలో ఆ ప్రక్రియ సహజం


మాట్లాడుతున్న జిల్లా జడ్జి శ్రీసుధ

మాధవనగర్‌(ఇందూరు గ్రామీణం), న్యూస్‌టుడే: మహిళల జీవితంలో రుతుచక్రం ప్రక్రియ సహజమైనదని జిల్లా న్యాయమూర్తి శ్రీసుధ పేర్కొన్నారు. మంగళవారం మాధవనగర్‌లోని ఎస్‌ఎస్‌ఆర్‌ డిస్కవరీ స్కూల్‌లో జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ ఆధ్వర్యంలో మహిళల్లో రుతుస్రావం, పరిశుభ్రతపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. దీనికి ఆమె హాజరై మాట్లాడారు. రుతుచక్ర సమయంలో రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయి తగ్గిపోతుందన్నారు. దానికి తగ్గట్టుగా సరైన కాల్షియంతో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లాపాలనాధికారి ఎంఆర్‌ఎం రావు మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థినులకు రుతుచక్ర సమయంలో కావాల్సిన సామగ్రిని (ఆరోగ్య కిట్లు) రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందన్నారు. ప్రభుత్వం విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి కిరణ్మయి, డాక్టర్‌ దినేష్‌ కుమార్‌, భార్గవ్‌, హరిశంకర్‌, ఎస్‌ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల ఛైర్మన్‌ మారయ్యగౌడ్‌, హరిత గౌడ్‌, వైద్య కళాశాల విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here