స్థల దాతకు సన్మానం

0
4


స్థల దాతకు సన్మానం

దాత రాఘవరెడ్డిని సన్మానిస్తున్న సర్పంచి బాల్‌రెడ్డి, గ్రామస్థులు

ఆత్మకూర్‌(నాగిరెడ్డిపేట), న్యూస్‌టుడే: ఆత్మకూర్‌లో శివాలయం నిర్మాణానికి రూ.6 లక్షల విలువైన స్థలం అందించిన దాత కుంట రాఘవరెడ్డిని ఆదివారం సర్పంచి బాల్‌రెడ్డి, పాలకవర్గం సభ్యులు శాలువాతో సత్కరించారు. రాఘవరెడ్డి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మిలటరీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ హైదరాబాద్‌లో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నీటిశుద్ధి కేంద్రం, రూ.3 లక్షలతో పాఠశాల గదుల మరమ్మతులు, పాలరాతి సరస్వతి విగ్రహం ఏర్పాటు చేసిన దాత స్వగ్రామ సేవలను కొనియాడారు. శివాలయానికి 20 గంటల భూమిని రూ. 6 లక్షలకు కొనుగోలు చేసి అందించినట్లు పేర్కొన్నారు. ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌, ఉప సర్పంచి ఆనంద్‌రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్థులు ఉన్నారు.

శిథిలమైన ఇళ్ల కూల్చివేత

రామారెడ్డి, న్యూస్‌టుడే: మండల కేంద్రంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా శిథిలావస్థకు చేరిన ఇళ్లను ఆదివారం సర్పంచి సంజీవ్‌ ఆధ్వర్యంలో కూల్చివేయించారు. ఎనిమిదో వార్డులో నాలుగు ఇళ్లు తొలగించారు. ఈ సందర్భంగా సంజీవ్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు వనిత, కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here