స్నేహితురాలి ముఖాన్ని చిధ్రం చేసి చంపేసిన బెస్ట్ ఫ్రెండ్స్.. అందమే శాపమైంది!

0
1


‘‘ప్లీజ్.. అమ్మతో అర్జంటుగా మాట్లాడాలి. నా ఫోన్‌లో టాప్అప్ వేయించు. డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి’’ అంటూ తన స్నేహితురాలి ఫోన్‌కు మెసేజ్ పంపిన ఆమె.. ఆ తర్వాత రోజు శవమైంది. తల్లిదండ్రులు సైతం గుర్తుపట్టలేనంతగా ముఖం చిధ్రమై.. ఒళ్లంతా గాయాలతో అత్యంత ధీనస్థితిలో కనిపించింది. ఆమెకు ఈ దుస్థితి కల్పించింది మరెవరో కాదు.. ఆమె స్నేహితురాళ్లే.

ఏం జరిగింది?: రష్యాలోని అర్ఖంగెల్స్క్‌లో నివసిస్తున్న విక్టోరియా అవెరినా (17) అలియాస్ వికాకు 16 ఏళ్ల లీనా, ఇరినా అనే స్నేహితులు ఉన్నారు. ఆమె ఎప్పుడు వారితోనే కలిసి తిరుగుతుండేది. వారి మధ్య ఏమైందో ఏమో, ఓ రోజు లీనా, ఇరినాలు.. వికాను పాడుబడిన భవనానికి పిలిచారు. అనంతరం గాజు సీసాలను వీకా ముఖంపై కొట్టారు. పగిలిన గాజు పెంకులతో వికా ముఖాన్ని గుర్తుపట్టని విధంగా చెక్కేశారు. అనంతరం గొంతు నులిమి చంపి ఇంటికి వెళ్లిపోయారు.

Read Also:
ఇన్‌స్టాగ్రామ్ స్టార్ తలనరికి ఫొటోలను షేర్ చేసిన హంతకుడు, నెటిజనులు షాక్!

వికా కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. జాగిలాలతో శోధించగా పాడుబడిన బంగళా సమీపంలోని పచ్చిక బయళ్లలో ఆమె శవం లభ్యమైంది. విచారణలో భాగంగా పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. హత్యకు ముందు ఆమె లీనా, ఇరీనాలతో మాట్లాడినట్లు ఫోన్ కాల్స్ ఆధారంగా తెలుసుకున్నారు. అనంతరం ఆ ఇద్దరిని అనుమానస్పద నిందితులుగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో లీనా, ఇరీనా చేసిన నేరాన్ని అంగీకరించారు.

అందం.. అహంకారం వల్లే..: విచారణలో లీనా, ఇరీనా విస్తుగొలిపే విషయాలు చెప్పారు. ఆమె తమకంటే ఎక్కువ అందంగా, ఆకర్షనీయంగా ఉంటుందని, ఆమె తన అందం చూసుకుని తమని ఎప్పుడూ హేళన చేసేదన్నారు. ఆ ప్రవర్తన నచ్చకపోవడం వల్లే ఆమెకు బుద్ధి చెప్పాలనుకున్నామని తెలిపారు. అయితే, పోలీసులు దీని వెనుక వేరే కారణాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ హత్యకు మరో వ్యక్తి సహకరించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Read Also: 9వ అంతస్తు బాల్కానీలో సెక్స్ చేస్తూ కిందపడ్డ జంట.. ఘటనలో ఎన్నో ట్విస్టులు!

ఈ ఘటనపై మరో స్నేహితురాలు (పేరు గోప్యంగా ఉంచారు) స్పందిస్తూ.. ‘‘వికా ఆ ఇద్దరితో చాలా సన్నిహితంగా మెలిగేది. శరీర ఆకృతిలో వికా కంటే లీనా, ఇరీనాలు భారీగా ఉండేవారు. గుండాల్లా ప్రవర్తించేవారు. వికా అందంగా ఉంటుందనే మాట వాస్తవమే. కానీ, అదే ఆమె హత్యకు కారణం అంటే నమ్ముబుద్ధి కావడం లేదు. చనిపోడానికి ముందు వికా నాకు మెసేజ్ పంపింది. తన మొబైల్‌లో టాప్‌అప్ వేయాలని కోరింది. అమ్మకు అర్జంటుగా ఫోన్ చేయాలని, తన ఫోన్లో డబ్బులు లేవని మెసేజ్‌లో తెలిపింది’’ అని పేర్కొంది. ఈ నేరం రుజువైతే లీనా, ఇరీనాలకు 15 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయి.
Image credit: EastWestNewsSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here