స్మార్ట్ బ్యాంగిల్స్.. ఈ గాజులు దొంగల తాట తీస్తాయి, మహిళలను రక్షిస్తాయ్!

0
0


పదలో ఉన్న మహిళలను ఆదుకోడానికి ఇటీవల ఎన్నో గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చాయి. మొబైల్ యాప్స్ నుంచి స్మార్ట్ వాచ్‌లు వరకు ప్రతి ఒక్కటీ వారి రక్షణకు ఉపయోగపడేవే. తాజాగా.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు ‘స్మార్ట్ బ్యాంగిల్స్’ పేరుతో తయారు చేసిన గాజులు మహిళలకు మరింత భద్రతను అందిచనున్నాయి. దుండగుల భరతం పడతాయి.

23 ఏళ్ల గాది హరీష్ తన స్నేహితుడు సాయి తేజాతో కలిసి ఈ గాజులను తయారు చేశాడు. ఈ గాజులను ఎవరైనా లాక్కోడానికి ప్రయత్నించినా, గట్టిగా పట్టుకున్నా షాక్ కొడతాయి. అంతేకాదు.. వెంటనే ఆ గాజులోని సెక్యూరిటీ వ్యవస్థ యాక్టీవ్ అవుతుంది. పోలీసులకు, ఆ గాజులు ధరించే మహిళ బంధువులకు వెంటనే మెసేజ్‌లు చేరుకుంటాయి. అలాగే, ఆమె ఉండే లోకేషన్‌ను కూడా తెలుపుతాయి. ఆపదను గుర్తించగానే బాధితురాలు ఆ గాజును ఒక పక్కకు తిప్పితే చాలు. మొత్తం వ్యవస్థంతా యాక్టివ్ అవుతుంది.

ఈ సందర్భంగా హరీష్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘మహిళలపై అత్యాచారాలు, హత్యలు, అపహరణలు ఎక్కువైన నేపథ్యంలో ‘సెల్ఫ్ సెక్యూరిటీ బ్యాంగిల్’ ప్రాజెక్టును ప్రారంభించాం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరికరాలకంటే భిన్నంగా ఈ గాజులు పనిచేస్తాయి’’ అని తెలిపారు. ఈ ప్రాజెక్టను పూర్తి చేయడానికి ప్రభుత్వం సహకరించాలని హరీష్ కోరాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here