స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

0
1


స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

మంగళ్‌పాడ్‌(ఎడపల్లి), న్యూస్‌టుడే: ప్రణాళికా పనులు చేపట్టి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని జడ్పీ ఛైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు పిలుపునిచ్చారు. ఎడపల్లి మండలం మంగళ్‌పాడ్‌, వడ్డెపల్లిలో కొనసాగుతున్న పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. మొక్కలను నాటి కంచెను ఏర్పాటు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో వన సంపద 22 నుంచి 33 శాతానికి పెరిగిందన్నారు. వనసంపదతో కరవును అరికట్టవచ్చని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంగళ్‌పాడ్‌ ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట జడ్పీ వైస్‌ ఛైర్‌పర్సన్‌ రజితాయాదవ్‌, ఎంపీపీ శ్రీనివాస్‌, సర్పంచులు హన్మాండ్లు, శ్రీధర్‌, వనజ, ఎంపీడీవో శంకర్‌, ఎంఈవో రామారావు, నాయకులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here