స్వచ్ఛ బహుమతి అందిస్తాం

0
1


స్వచ్ఛ బహుమతి అందిస్తాం

ఎల్లారెడ్డి, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరు ముందుకొస్తేనే పరిసరాల పరిశుభ్రత సాధ్యమవుతుందని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని గాంధీనగర్‌లో 30 రోజుల ప్రణాళికను బుధవారం ఆయన పరిశీలించారు. పిచ్చిమొక్కలు, కాల్వల్లో పేరుకుపోయిన మురుగును తొలగించారు. దోమల నివారణకు మురుగు కాలువల్లో ఆయిల్‌ బాల్స్‌  వేశారు.  పారిశుద్ధ్య నిర్వహణను సక్రమంగా నిర్వహించే ప్రాంతాలకు జనవరి 26న బహుమతులు అందజేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, కమిషనర్‌ వెంకటేశం, మేనేజర్‌ జీవన్‌, సిబ్బంది పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here