స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 15వ ఆగష్టు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని శాఖలు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. జనహితలో ఏర్పాటైన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. స్టేడియంలో ఏర్పాట్లను మునిసిపల్‌, రెవెన్యూ అధికారులు చూసుకోవాలన్నారు. వివిధ శాఖలు తమ స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. వివిధ శాఖల నుంచి లబ్దిదారులకు అందించే చెక్కులను ఆయా శాఖలు సిద్దం చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా 108 సర్వీసు, ఫైర్‌ సర్వీసుకు చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగుల వివరాలు సేకరించాలని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఎస్‌పి శ్వేత, ఆర్డీవో రాజేందర్‌, సిపివో శ్రీనివాస్‌, జడ్పి సిఇవో కాంతమ్మ, ఏవో పద్మారావు, తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here