హక్కుల తొలగింపు తగదు

0
1


హక్కుల తొలగింపు తగదు


మాచారెడ్డిలో మాట్లాడుతున్న గణేష్‌నాయక్‌ తదితరులు

మాచారెడ్డి, న్యూస్‌టుడే: రాజ్యాంగ బద్ధంగా వచ్చిన రిజర్వేషన్లను తొలగించాలని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాబురావు ప్రకటించడం సరికాదని లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నూనావత్‌ గణేష్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. మాచారెడ్డి మండలం గజ్యానాయక్‌తండా గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఎంపీ తీరుపై ధ్వజమెత్తారు. రాజ్‌గోండులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనడం అవివేకమని విమర్శించారు. కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు భుక్యా బన్సీలాల్‌నాయక్‌, లంబాడ హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, ప్రధాన కార్యదర్శి రవీందర్‌నాయక్‌, రమేష్‌నాయక్‌, రామునాయక్‌, వసంత్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here