హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలి

0
3నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారుల హక్కుల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షులు జస్టిస్‌ ఎంఎస్‌కె జైస్వాల్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం జెడ్‌పి ప్రాంగణంలో (పాముల బస్తీ) గల జిల్లా వినియోగదారుల ఫోరం భవనాన్ని జస్టిస్‌ జైస్వాల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు వినియోగదారుల వారి హక్కులను కాపాడుకునేందుకు కషి చేయాలి. వినియోగదారుల కోర్టులో అడ్వకేట్‌ అవసరం లేకుండా స్వతహాగా కేసు వేసుకోవచ్చునని సివిల్‌ కోర్ట్‌ కంటే తక్కువ సమయంలో తీర్పు పొందవచ్చును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారుల హక్కులను కాపాడేందుకు ఎంతో కషి చేస్తున్నాయని ఈ కోర్టు ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని సేవలలో లోపాలుంటే కోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చునన్నారు. జిల్లా వినియోగదారుల ఫోరం సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన జిల్లా ప్రజలను కోరారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here