హనుమాన్‌ విగ్రహం తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ కేంద్రంలోని కమలనెహ్రూకాలనీలో శనివారం గంగాధర్‌ గౌడ్‌, లయ గోల్డ్‌ వాటర్‌ ప్లాంట్‌ అధినేత అక్రమంగా హనుమాన్‌ విగ్రహాన్ని తొలగించినందుకు భజరంగ్‌ దళ్‌, హిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో కాలనీ వాసులతో కలిసి రాస్తారోకో, నిరసన ధర్నా చేపట్టారు. ఆర్మూర్‌ పట్టణంలోని కమల నెహ్రు కాలనీలో 428 సర్వే నంబర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అనంతరం విశ్వహిందూ పరిషత్‌ బజరంగ్‌ దళ్‌ ఆర్మూర్‌ శాఖ పూజ నరేందర్‌ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి విగ్రహానికి పూజలు జరుగుతున్నాయని, హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ప్రవర్తిచినవారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో హిందువులందరితో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాలనీకి చెందిన మాజీ కౌన్సిలర్‌ రాజబాబు జరిగిన సంఘటనను ఆర్మూర్‌ సిఐ రాఘవేంద్రకు వివరించగా వెంటనే స్పందించిన పోలీసులు విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించారు. అనంతరం కాలనీవాసులు సర్దుబాటు అయ్యారు. అట్టి స్థలంలో దాదాపుగా కాలనీవాసులు గత 20 సంవత్సరాల నుండి మంచినీరు త్రాగేవారని ఆ స్థలంలో మూడు బోర్లు ఉన్నాయని వాటి నుంచి వచ్చే మంచినీరు స్వీకరిస్తున్నామని కాలనీ మహిళలు తెలిపారు. అక్రమంగా స్థలాన్ని కబ్జా చేసుకున్న లయ గోల్డ్‌ వాటర్‌ ప్లాంట్‌ అధినేత గంగాధర్‌ గౌడ్‌పై చట్ట పరమైన కేసు నమోదు చేయాలని ఆర్మూర్‌ ఏసిపి కార్యాలయం వరకు ర్యాలీతో వెళ్లి మెమోరాండం అందజేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here