హరిత తెలంగాణ కై పాటుపడదాం

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణకై పాటుపడినప్పుడే తెలంగాణ హరిత తెలంగాణగా మారుతుందని నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణకు మణిహారం హరితహారం గా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఆరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వికార్‌ పాషా, ఎంపీటీసీ హైమద్‌, ప్రత్యేకాధికారి సాయికుమార్‌, పంచాయతీ కార్యదర్శి రఘురామ్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు కుర్మె సాయిలు, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here