హింసను పారదోలి శాకాహారులుగా మారాలి

0
2


హింసను పారదోలి శాకాహారులుగా మారాలి

మాట్లాడుతున్న సుభాష్‌ పత్రీజీ

దేవునిపల్లి(కామారెడ్డి గ్రామీణం), న్యూస్‌టుడే: భూమిపై ఉన్న మనుషులందరూ హింసను పారదోలి శాకాహారులుగా మారాలని స్పిరిచువల్‌ సొసైటీస్‌ మూవ్‌మెంట్‌ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి సుభాష్‌ పత్రీజీ పిలుపునిచ్చారు. మండలంలోని దేవునిపల్లి దేవివిహార్‌ కాలనీలో ఆదివారం నిర్వహించిన ధ్యాన తరగతుల ఆత్మీయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పిరమిడ్‌ ఉపయోగించి ధ్యానం చేయాలని తద్వారా మానసిక, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయన్నారు. పిల్లలు చదువులో ముందజలో ఉండడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి ధ్యానం అత్యుత్తమ మార్గమని తెలిపారు. కార్యక్రమంలో ప్రతినిధులు విఠల్‌, చంద్రశేఖర్‌, రామకృష్ణ, భూంరెడ్డి, ప్రభాకర్‌, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here