హెల్మెట్ కంపెనీ, అమూల్…. దీనికోసమే చూస్తున్నాం: కాశ్మీర్‌కు పెట్టుబడుల వెల్లువ

0
1


హెల్మెట్ కంపెనీ, అమూల్…. దీనికోసమే చూస్తున్నాం: కాశ్మీర్‌కు పెట్టుబడుల వెల్లువ

శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక హక్కులు కల్పించే అధికరణ 370, 35ఏలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. దీంతో జమ్ము కాశ్మీర్‌పై ఇక నుంచి కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ హక్కులు, బాధ్యతలు ఉంటాయి. ఇప్పటి వరకు కేంద్రానికి సంపూర్ణ హక్కులు లేవు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని దాదాపు అందరూ స్వాగతించారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో గతంలో జమ్ము కాశ్మీర్ నుంచి గెంటివేయబడిన కాశ్మీరీ పండిట్లు తిరిగి వచ్చేందుకు ఆస్కారం ఏర్పడింది. మిగతా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల వలె జమ్ము కాశ్మీర్ ఉంటుంది. 370 రద్దు నేపథ్యంలో జమ్ము కాశ్మీర్‌కు పరిశ్రమలు క్యూ కడతాయని భావిస్తున్నారు. అందుకు తగినట్లే పలు పరిశ్రమలు ఇక్కడ తమ ప్లాంట్ల నిర్మాణానికి మొగ్గు చూపుతున్నాయి.

దీని కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం

370 రద్దు ప్రకటన చేసిన ఒక్క రోజులోనే పలు కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపించాయి. హెల్మెట్ల తయారీ సంస్థ స్టీల్ బర్డ్ జమ్ము కాశ్మీర్‌లో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. కాశ్మీర్‌లో పారిశ్రామిక విప్లవానికి, ఉద్యోగ కల్పనకు 370 రద్దు గొప్ప ప్రారంభమని, ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఇలాంటి చర్యను తాము ఎప్పటి నుంచో ఆశిస్తున్నామని, ఈ అద్భుతమైన చర్యతో కాశ్మీర్‌ లోయ మిగిలిన భారతావనితో కలుస్తుందని, దేశ సమష్టి అభివృద్ధికి మూలంగా మారుతుందని స్టీల్ బర్డ్ చైర్మన్ సుభాష్ తెలిపారు.

హెల్మెట్ల ఉత్పత్తి కోసం...

హెల్మెట్ల ఉత్పత్తి కోసం…

370 ఆర్టికల్ రద్దు కీలక చర్య అని, స్థానికంగా ఉన్న ఇన్వెస్టర్లతో కలిసి పారిశ్రామిక వాతావరణం నెలకొల్పేందుకు అవకాశముందని, ఇక్కడ తయారీ యూనిట్ నెలకొల్పే విషయాన్ని అక్టోబర్‌లో నిర్వహించనున్న ఇన్వెస్టర్ల మీట్‌లో నిర్ణయిస్తామన్నారు. స్టీల్ బర్డ్ హిమాచల్‌ ప్రదేశ్‌లోని బడ్డీలో రూ.150 కోట్లతో ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. హెల్మెట్ల ఉత్పత్తిని రోజుకు 44,500కు పెంచాలని నిర్ణయించింది.

కంపెనీల పెట్టుబడులు

కంపెనీల పెట్టుబడులు

ఆర్టికల్ 370 ముగిసినందున జమ్ము కాశ్మీర్‌లో వృద్ధిని పెంచేందుకు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు రావాలని ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కొటక్ పిలుపునిచ్చారు. అముల్, లెమన్ ట్రీ వంటి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

అమూల్ ఉత్పత్తులు

అమూల్ ఉత్పత్తులు

జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో అమూల్ డెయిరీని విస్తరించాలని గుజరాత్ పాల ఉత్పత్తిదారుల సమాఖ్య నిర్ణయించింది. ఇక నుంచి రాళ్లు రువ్వకుండా ఆవులు, గేదెలతో కాశ్మీరీలు సంపాదించుకోవచ్చునని సూచించింది. అమూల్ జమ్మూకాశ్మీర్ పాల ఉత్పత్తిదారుల సంఘం పేరిట గతంలో ఏర్పాటైన డెయిరీ లాభాల్లో నడుస్తోంది. ప్రస్థుతం రోజుకు లక్ష లీటర్ల అమూల్ పాలను సరఫరా చేస్తోంది. త్వరలో ఐదు లక్షల లీటర్లకు పెంచనుంది. జమ్మూ, శ్రీనగర్ నగరాల్లో ఐస్ క్రీంతోపాటు పన్నీరు ప్లాంట్, డెయిరీలు నెలకొల్పాలని భావిస్తోంది. పాల ఉత్పత్తి తక్కువగా ఉన్న జమ్మూకాశ్మీర్‌లో డ్వాక్రా సంఘాల ఏర్పాటు ద్వారా మహిళా రైతుల్ని ప్రోత్సహించనుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here