హైదరాబాద్ సహా 8 సిటీల్లో 31% పెరిగిన లీజింగ్

0
0


హైదరాబాద్ సహా 8 సిటీల్లో 31% పెరిగిన లీజింగ్

న్యూఢిల్లీ: 2019 క్యాలెండర్ ఇయర్‌లో తొలి అర్ధ సంవత్సరంలో వేర్ హౌస్ లీజ్ 31 శాతం పెరిగిందని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ CBRE వెల్లడించింది. దేశంలోని 8 ముఖ్య నగరాల్లో 31 శాతం పెరిగి 13 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు చేరుకుందని తెలిపింది. అదే సమయంలో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ రియల్ ఎస్టేట్ రంగంలో రూ.200 మిలియన్లు ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపింది. ఈ విభాగంలో హైదరాబాద్‌లోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో 12 నుంచి 18 శాతం మేరకు అధిక అద్దెలు గిట్టుబాటు అవుతున్నట్లు తెలిపింది. CBRE సోమవారం పారిశ్రామిక, వస్తు రవాణా మార్కెట్‌కు సంబంధించిన అధ్యయన నివేదికను విడుదల చేసింది.

1.30 లక్షల కోట్ల స్థలం లీజుకు

2019 ద్వితీయార్థంలో ఉత్తర హైదరాబాదులో కొత్త సంస్థలు స్థలాన్ని లీజుకు తీసుకునే అవకాశముందని, ఫలితంగా అద్దెలు గణనీయంగా పెరుగుతాయని అభిప్రాయపడింది. హైదరాబాదులో ముప్పై నుంచి యాభై లక్షల లోపు చ.అ. స్థలంలో సరికొత్త గిడ్డంగులు ఏర్పాటు అవుతుందని పేర్కొంది. అదే సమయంలో 2019 ప్రథమార్థంలో లాజిస్టిక్స్ లీజింగ్ విభాగంలో 8 మేజర్ నగరాల్లో దాదాపు 1.30 లక్షల కోట్ల చ.అ. స్థలాన్ని పలు సంస్థలు లీజుకు తీసుకున్నట్లు తెలిపింది. దీంతో గత ఏడాది మొదటి ఆరు నెలలతో పోల్చితే 2019 ప్రథమార్థంలో సుమారు 31 శాతం వృద్ధి నమోదయిందని పేర్కొంది.

31 శాతం పెరుగుదల

31 శాతం పెరుగుదల

వేర్ హౌసింగ్/లాజిస్టిక్ స్పేస్‌లో 56 శాతం థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ఫర్మ్స్ ద్వారానే ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు తెలిపింది. ముంబై, చెన్నై, బెంగళూరులలో లీజింగ్ కార్యకలాపాలు 60 శాతం పెరిగాయి. ఇయర్ బేస్‌గా ఈ ఆరు నెలల్లో లాజిస్టిక్స్ లీజింగ్ 31 శాతం పెరిగింది. జాబితాలో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్ ఉన్నాయి. లాజిస్టిక్స్ లీజింగ్ యాక్టివిటీస్ మరింత ఎక్కువ అవుతాయని భావిస్తున్నట్లు CBRE అభిప్రాయపడింది.

ఏ నగరంలో ఎంత పెరిగిందంటే...

ఏ నగరంలో ఎంత పెరిగిందంటే…

2019 తొలి అర్ధ సంవత్సరంలో ముంబై, చెన్నై, అహ్మదాబాదులలో 11 మిలియన్ల స్క్వేర్ ఫీట్ స్పేస్ యాడ్ అయినట్లు తెలిపింది. 2018 తొలి అర్ధ సంవత్సరంలో డొమెస్టిక్ కార్పోరేట్ డిమాండ్ 67 శాతంగా ఉండగా, ఇప్పుడు 85 శాతానికి పెరిగింది. NCRలోని NH-1, NH-8లలో రెంటల్ గ్రోత్ 5-40 శాతం, బెంగళూరు ఈస్టర్న్, వెస్టర్న్ కారిడార్‌లో 3 నుంచి 24 శాతం, హైదరాబాద్ వెస్టర్న్, సదర్న్ కారిడార్‌లలో 12 నుంచి 18 శాతం, చెన్నై వెస్టర్న్ కారిడార్ 2, నార్తర్న్ కారిడార్‌లో 5 నుంచి 7 శాతం, అహ్మదాబాద్‌లోని నారోల్‌లో 3 నుంచి ఆరు శాతం పెరిగాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here