హోమ్ లోన్ మరింత చౌక కానున్నాయి, రెపో రేటు పెరిగితే…

0
1


హోమ్ లోన్ మరింత చౌక కానున్నాయి, రెపో రేటు పెరిగితే…

బ్యాంకులు… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సూచించిన బెంచ్ మార్క్‌లకు లోన్స్‌ను అనుసంధానించనున్న నేపథ్యంలో రుణగ్రహీతలు చెల్లించాల్సిన మొత్తం ఈ వారంలో తగ్గనుంది. కొన్ని సందర్భాల్లో 30 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చు. ఒక బేసిస్ పాయింట్ 0.01 పర్సంటేజ్ పాయింట్.

ఉదాహరణకు ప్రస్తుత బెంచ్ మార్క్ ప్రకారం ఎస్బీఐ వడ్డీ రేటు 8.05 శాతంగా ఉండనుంది. ఇంతకుముందు ప్రకారం శాలరైడ్‌కు రూ.30 లక్షలు హోమ్ లోన్ తీసుకుంటే 8.30 శాతంగా వడ్డీ రేటు ఉండేది. ఇప్పుడు 8.20 శాతంగా ఉండనుంది. అయితే కస్టమర్ ప్రొఫైల్ ఆధారంగా ఛార్జీల్లో మార్పులుంటాయి.

నాన్ శాలరైడ్స్ అయితే అధికం

నాన్ శాలరైడ్స్ ఎవరైనా రుణాలు తీసుకుంటే ఎస్బీఐ అదనంగా 15 శాతం ఛార్జ్ చేస్తుంది. హయ్యర్ రిస్క్ గ్రేడ్ (RG) 4-6 మధ్య ఉంటే 10 బేసిస్ పాయింట్లు పెరుగుతాయి. ఆర్బీఐ సూచించిన మేరకు రెపో రేటు లేదా మూడు నెలలు లేదా ఆరు నెలలు ట్రెజరీ బిల్స్ వంటి బెంచ్ మార్క్స్ ఉన్నాయి. క్రెడిట్ వృద్ధి, వినియోగం వంటివి పెంచేందుకు బాహ్య వడ్డీ రేట్లను బెంచ్ మార్కు రుణాలతో అనుసంధానించాల్సి ఉంటుందని సెంట్రల్ బ్యాంకు సెప్టెంబర్ 4న ప్రకటించింది.

బెంచ్ మార్క్ బ్యాంకుల ఇష్టం

బెంచ్ మార్క్ బ్యాంకుల ఇష్టం

అయితే బెంచ్ మార్క్ నిర్ణయం బ్యాంకుల ఇష్టం. బ్యాంకులకు కేంద్ర బ్యాంకు స్వేచ్ఛ ఇచ్చింది. రుణ గ్రహీత క్రెడిట్ అసెస్మెంట్‌కు అనుగుణంగా రిస్క్ ప్రీమియంలు మారవచ్చు. ఆర్బీఐ రెపో రేటు ఫిబ్రవరి 2010 తర్వాత కనిష్టస్థాయిలో 5.4 శాతంగా ఉంది. మూడు నెలల టీ-బిల్ రేటు ఫిబ్రవరి నుంచి 100 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింది. ప్రస్తుతం 5.28 వద్ద ఉంది. ఆరు నెలల టీ-బిల్ రేట్ 5.48 శాతంగా ఉంది. ఇది ఫిబ్రవరిలో 6.4గా ఉంది. ఫిబ్రవరి 2019, ఆగస్ట్ 2019 మధ్య రెపో రేటు 110 బేసిస్ పాయింట్లు తగ్గించగా, ఎంసీఎల్ఆర్ 20 బేసిస్ పాయింట్లు మాత్రమే తగ్గింది.

ఈఎంఐలలో గణనీయ అస్థిరత

ఈఎంఐలలో గణనీయ అస్థిరత

రుణ రేట్లపై బాహ్య బెంచ్ మార్క్ వల్ల రుణగ్రహీతలకు సమానమైన ఈఎంఐలలో గణనీయమైన అస్థిరత ఏర్పడే అవకాశముందని ICRA నివేదిక పేర్కొంది. రెపో రేటులో 50 బేసిస్ పాయింట్లు పెరిగితే రూ.75 లక్షల రుణంపై 15 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ చెల్లింపు రూ.2,200 పెరుగుతుందని అంచనా. 100 బేసిస్ పాయింట్లు అయితే నెలకు రూ.4,500 వరకు జేబుకు చిల్లు పడవచ్చు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here