‘హౌడీ మోడీ’ ఎఫెక్ట్: భారత్‌తో మళ్లీ వాణిజ్య ఒప్పందం.. ప్రకటించిన ట్రంప్!

0
2


‘హౌడీ మోడీ’ ఎఫెక్ట్: భారత్‌తో మళ్లీ వాణిజ్య ఒప్పందం.. ప్రకటించిన ట్రంప్!

అమెరికా తన తప్పు తెలుసుకుంది. భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఆ దేశం పునరాలోచించింది. దానివల్ల తనకే నష్టమని గ్రహించి నాలుకు కరుచుకుంది. అందుకే, మళ్లీ భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించుకుంది. దీనిపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేశారు.

గత జూన్‌లో అమెరికాలోని ట్రంప్ సర్కారు.. జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పీ) జాబితా నుంచి మన దేశాన్ని తొలగించింది. ఆ తరువాత భారత్ నుంచి ఎగుమతి అవుతున్న ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించింది. అయితే దీనివల్ల లాభం కన్నా నష్టమే అధికంగా ఉందని భావించిన ట్రంప్ సర్కారు చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకునే చర్యలు మొదలుపెట్టింది.

జీఎస్సీ ద్వారానే అత్యధిక లబ్ధి…

జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పీ) ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ దేశాల్లో తయారవుతున్న ఉత్పత్తులను ఎలాంటి పన్నులు లేకుండా అమెరికాకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంది. వర్ధమాన, పేద దేశాలు ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా అమెరికా 1970లో ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. దీనివల్ల మన దేశానికి అత్యధిక లబ్ధి కలుగుతోంది. ఈ కార్యక్రమం మొదలైన కాలంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 3.5 శాతం ఉండేది. ఇప్పుడు ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ పరుగులు తీస్తోంది.

ట్రంప్ సర్కారు నజర్...

ట్రంప్ సర్కారు నజర్…

అయితే గత మార్చిలో ట్రంప్ సర్కారు దృష్టి ఈ జీఎస్పీపై పడింది. ఈ విధానం వల్ల ఇతర దేశాల్లో తయారైన వస్తువులు ఎలాంటి పన్ను పడకుండానే అమెరికా మార్కెట్‌లోకి డంప్ అవుతున్నాయని, దీనివల్ల అమెరికాకే నష్టమని గ్రహించింది. అంతేకాకుండా, భారత్ తన మార్కెట్లు అమెరికాకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం లేదని, తమ దేశ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తోందని పలు ఆరోపణలు గుప్పించిన ట్రంప్ సర్కారు .. జీఎస్పీ జాబితా నుంచి భారత్‌ను తొలగిస్తున్నామని ఈ ఏడాది జూన్‌ 5న ప్రకటించింది.

భారత్ తక్కువేం తినలేదు...

భారత్ తక్కువేం తినలేదు…

జీఎస్పీ జాబితా నుంచి భారత్‌ను తొలగిస్తూ అమెరికాలోని ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకోవడంతో భారత్ ఎగుమతులపై కొంత మేర ప్రభావం పడిందనే చెప్పాలి. అయితే.. మరీ అంతగా భయపడాల్సినంత నష్టమేమీ ఉండదని, పైగా ఇది అమెరికా-భారత్‌ల మధ్య గల అన్ని రకాల వాణిజ్య సంబంధాలనూ ప్రభావితం చేయబోదని భారత్‌కు తెలుసు. మరోవైపు అమెరికా చర్యకు ప్రతిగా భారత్ కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే 20 రకాల ఉత్పుత్తులపై సుంకాలు భారీగా పెంచాలని నిర్ణయించింది.

తప్పు తెలుసుకున్న ట్రంప్ సర్కారు?

తప్పు తెలుసుకున్న ట్రంప్ సర్కారు?

అయితే భారత్‌కు జీఎస్పీ హోదా తొలగించడం ద్వారా ఆర్థికంగానేకాక ఉద్యోగాలపరంగానూ అమెరికా నష్టపోతోందంటూ ఇటీవల ఆ దేశ చట్టసభలకు చెందిన 44 మంది ప్రతినిధులు అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ రాశారు. అంతేకాదు, అమెరికాలో మన తెలుగు వాళ్ల సంఖ్య దాదాపు 40 లక్షలకు చేరింది. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ ట్రంప్ గెలవాలంటే వీరి మద్దతు చాలా కీలకం. దీంతో భారత్‌తో సఖ్యతగా వ్యవహరించడం ద్వారానే భారతీయ అమెరికన్లను ఆకట్టుకోగలమని ట్రంప్ భావించారు. ప్రస్తుతం స్వదేశంలో మోడీకి ఉన్నంత ఫాలోయింగ్ ఏ రాజకీయ నాయకుడికీ లేకపోవడం కూడా ఆయనకు కలిసి వచ్చింది.

ఫలించిన ‘హౌడీ మోడీ' సదస్సు...

ఫలించిన ‘హౌడీ మోడీ’ సదస్సు…

ఈ నేపథ్యంలోనే మొన్న ఆదివారం అమెరికాలోని హ్యూస్టన్‌లో ‘హౌడీ మోడీ’ సభ ఏర్పాటైంది. అక్కడి ఎన్నార్జీ స్టేడియం భారతీయులతో కిక్కిరిసిపోయింది. ఒక రాక్ మ్యూజిక్ కాన్సర్ట్‌కు హాజరైన మాదిరిగా భారీ సంఖ్యలో భారతీయ అమెరికన్లు ‘మోడీ.. మోడీ’ అంటూ హోరెత్తించడం చూసి ట్రంప్ సైతం ఆశ్చర్యపోయారు. ప్రస్తుత ప్రపంచ నాయకుల్లో నరేంద్ర మోడీకి తప్ప మరెవరికీ ఒక విదేశంలో నిర్వహించిన సభలో ఇంతటి ఆదరణ కనిపించలేదు. దీంతో భారతీయ అమెరికన్ సమాజంపై మోడీకి ఉన్న పట్టు ఏమిటో ఈ సభ ద్వారా ట్రంప్‌కు అవగతమైంది.

మోడీకి ఆదరణ చూసి అవాక్కైన ట్రంప్...

మోడీకి ఆదరణ చూసి అవాక్కైన ట్రంప్…

గతంలో మోడీపై పలు సందర్భాల్లో ట్రంప్ ‘టారిఫ్ కింగ్’, ‘టఫ్ నెగోషియేటర్’ అంటూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసేవారు. కానీ మొన్న హ్యూస్టన్‌లో ‘హౌడీ మోడీ’ సభలో భారత ప్రధానికి లభించిన ఆదరణ చూసిన తరువాత.. మోడీ శక్తి ఏంటో ఆయనకు అర్థమైంది. దీంతో ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నారు. మోడీని పొగడడం మొదలుపెట్టారు. ముంబైలో జరగబోయే ఎన్‌బీఏ మ్యాచ్‌కు నన్ను కూడా పిలుస్తారా? అంటూ చమత్కరించారు.

ట్రంప్, మోడీ పరస్పర పొగడ్తలు...

ట్రంప్, మోడీ పరస్పర పొగడ్తలు…

హౌడీ మోడీ సభలో అటు ట్రంప్, ఇటు మోడీ ఇద్దరూ పరస్పరం పొగడ్తలు కురిపించుకున్నారు. అమెరికాకు అత్యంత విధేయత కలిగిన, నమ్మకమైన స్నేహితుడు మోడీ అని ట్రంప్ అన్నారు. అంతేకాదు, భారత్‌లో కోట్ల మందిని పేదరికం నుంచి మోడీ బయటకు తెచ్చారని కితాబునిచ్చారు. ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించారని, ఆర్థిక సంస్కరణల ద్వారా భారత్‌ను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని ప్రశంసించారు. మోడీ కూడ ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ట్రంప్ బలమైన నాయకుడని, అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మార్చేందుకు ఆయన ఎంతో చేస్తున్నారని ఆకాశానికి ఎత్తేశారు. ‘అబ్‌ కీ బార్.. ట్రంప్‌ సర్కార్‌’ అంటూ ఆయన్ని మునగచెట్టు ఎక్కించేశారు.

అమెరికాలో పెట్టుబడులతో ట్రంప్ ఖుష్...

అమెరికాలో పెట్టుబడులతో ట్రంప్ ఖుష్…

అమెరికాలో ‘హౌడీ మోడీ’ సభకు వెళ్లడానికి ముందురోజే మోడీ సర్కారు స్వదేశంలో కార్పొరేట్ పన్ను రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఒక సానుకూల చర్యగా ట్రంప్ సర్కారు భావించింది. అలాగే హ్యూస్టన్‌లో మోడీ సభకు ముందు ఇంధన రంగ ప్రతినిధులతో మోడీ చర్చలు జరపడం, భారత్‌కు చెందిన ‘పెట్రోనెట్’ కంపెనీ అమెరికా కంపెనీ అయిన టెల్లారియన్ నుంచి ఏటా 50 లక్షల టన్నుల ఎల్ఎన్‌జీ దిగుమతి చేసుకునేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం.. ఇలాంటివన్నీ ట్రంప్ సర్కారుకు సంతోషం కలిగించాయి.

మళ్లీ వాణిజ్య ఒప్పందానికి ట్రంప్ ఓకే...

మళ్లీ వాణిజ్య ఒప్పందానికి ట్రంప్ ఓకే…

దీంతో ఇన్నాళ్లూ భారత్, అమెరికాల నడుమ వాణిజ్య సమతౌల్యం లేదన్న ట్రంప్ తన మనసు మార్చుకున్నారు. భారత్‌తో మళ్లీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామంటూ ప్రకటించేశారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశ వేదిక వద్ద మోడీ సమక్షంలోనే ట్రంప్ ఈ మేరకు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధాన్ని మరింత బలోపేత చేసేలా ఈ ఒప్పందం ఉంటుందని, ఇప్పటికే ఈ దిశగా అమెరికా వ్యాపార ప్రతినిధి రాబర్ట్ లైట్‌హైజర్ చర్చలు కూడా జరిపారని అన్న ఆయన.. ఈ ఒప్పందం ఎప్పుడు జరుగుతుందనే విషయం మాత్రం చెప్పలేదు.

‘‘మన దేశ అవసరాలేమిటో చెప్పాం..''

‘‘మన దేశ అవసరాలేమిటో చెప్పాం..”

హ్యూస్టన్‌లో ఇంధన రంగ ప్రతినిధులతో మోడీ సమావేశం అనంతరం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మాట్లాడుతూ.. మన దేశ అవసరాలేమిటో అమెరికాలోని ట్రంప్ సర్కారుకు వివరించామని చెప్పారు. అమెరికాతో మళ్లీ వాణిజ్య ఒప్పందం కచ్చితంగా ఉంటుందని, అయితే ఎప్పుడు అన్నదానిపై ప్రత్యేకంగా చర్చ జరగలేదని తెలిపారు. అతి త్వరలోనే దీనిపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని, ఈ ఒప్పందం భారత్‌కు అమోదయోగ్యంగానే ఉంటుందని వ్యాఖ్యానించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here