1 నుంచి మద్యం దుకాణాలు.. ఏపీ రెవెన్యూ తగ్గుతుందా?: గం.9 వరకు షాప్స్, ఒక్కరికి మూడే బాటిల్స్..

0
2


1 నుంచి మద్యం దుకాణాలు.. ఏపీ రెవెన్యూ తగ్గుతుందా?: గం.9 వరకు షాప్స్, ఒక్కరికి మూడే బాటిల్స్..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 1వ తేదీ నుంచి 3,500 మద్యం దుకాణాలను నిర్వహించనుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి శనివారం నాడు ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే విడతల వారీగా మద్యం దుకాణాలను తొలగిస్తామని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పారు. ఈ హామీకి అనుగుణంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాక చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే నెల నుంచి మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది.

రాత్రి 9 గంటల వరకే దుకాణాలు

ప్రభుత్వం నిర్వహించే ఈ మద్యం దుకాణాలు ఉదయం పది గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. సాధారణంగా మద్యం దుకాణాలు అధికారికంగా లేదా అనధికారికంగా రాత్రి పది గంటలు, పన్నెండు గంటల వరకు కూడా తెరిచి ఉంటాయి. దీంతో మద్యం దుకాణాల ముందు నుంచి వెళ్లే వారు ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో. ప్రభుత్వ మద్యం దుకాణాలు మాత్రం రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరుచుకొని ఉంటాయి.

అక్రమాలు జరగకుండా ఎస్సై, సీఐకి దుకాణాల బాధ్యత

అక్రమాలు జరగకుండా ఎస్సై, సీఐకి దుకాణాల బాధ్యత

ఈ మద్యం దుకాణాల్లో అక్రమాలకు అవకాశం లేకుండా ఒక్కో ఎస్సై, సీఐకి 10 దుకాణాల చొప్పున బాధ్యతలను అప్పగించారు. ఎక్సైజ్ శాఖలో 678 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించారు. వీటిపై జగన్ సానుకూలంగా ఉన్నారు.

ఇప్పటి వరకు మద్యం దుకాణాల మీద ఆధారపడిన వారి పరిస్థితి...

ఇప్పటి వరకు మద్యం దుకాణాల మీద ఆధారపడిన వారి పరిస్థితి…

ఇప్పటి వరకు మద్యం దుకాణాలపై ఆధారపడి ఎంతోమంది జీవించారు. డీలర్లతో పాటు అందులో పని చేసేవారికి కూడా ఇదే ఆధారం. ఇప్పుడు వారికి ప్రత్యామ్నాయ ఉపాధి ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తుంది.

12,500కు పైగా ఉద్యోగాలు

12,500కు పైగా ఉద్యోగాలు

ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 3500 దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా గత నెలలో 475 ప్రభుత్వ మద్యం దుకాణాలను ఇప్పటికే ప్రారంభించారు. ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఈ లిక్కర్ దుకాణాలను నిర్వహిస్తారు. వీటి ద్వారా 3500 మంది సూపర్‌ వైజర్లు, 8033 మంది సేల్స్‌మెన్ ఉద్యోగాలు రానున్నాయి.

ఏపీ రెవెన్యూ తగ్గుతుందా?

ఏపీ రెవెన్యూ తగ్గుతుందా?

ప్రభుత్వం నిర్వహించే షాప్స్ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గదని, రిటైలర్లకు ఇచ్చే 10 శాతం ఇన్సెంటివ్ ప్రభుత్వానికే మిగులుతుందని చెబుతున్నారు. మద్యం షాపులు తగ్గినా ఇప్పటికిప్పుడు అయితే ఆదాయం తగ్గదని చెబుతున్నారు.

ఒక్కరికి మూడు బాటిల్స్, అక్కడే మద్యం సేవించలేరు..

ఒక్కరికి మూడు బాటిల్స్, అక్కడే మద్యం సేవించలేరు..

– ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్లో ఒక వ్యక్తికి మూడు బాటిల్స్ మాత్రమే ఇస్తారు.

– పాఠశాలలు, ఆధ్యాత్మిక సంస్థలకు దగ్గరగా మద్యం షాప్స్ ఉండవు.

– బార్లకు దగ్గరగా ప్రభుత్వం మద్యం దుకాణాలు పెడుతున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

– ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద మద్యం సేవించే అవకాశం లేదు.

– మద్యం దుకాణాలకు సంబంధించి కొన్నిచోట్ల అధిక అద్దెలు ఇస్తున్నారనే విమర్శలు వస్తాయి. వీటిని పరిశీలించి, చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

బయటి రాష్ట్రాల నుంచి రవాణాకు చెక్

బయటి రాష్ట్రాల నుంచి రవాణాకు చెక్

గత ప్రభుత్వం మద్యం దుకాణాల ఏర్పాటుకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చిందని, 4,380 మద్యం దుకాణాలకు అదనంగా ఒక్కో దానికి 10 చొప్పున 43వేల బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారని, ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కోచోట గబెల్ట్ షాప్స్ లేకుండా చర్యలు తీసుకున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ సేల్స్ అక్రమంగా రాకుండా 18 సరిహద్దు మొబైల్ పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేశామని, 31 చెక్ పోస్టులు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here