10 శాతానికి పైగా వడ్డీని ఇచ్చే డిబెంచర్లలో ఇన్వెస్ట్ చేయొచ్చా ?

0
5


10 శాతానికి పైగా వడ్డీని ఇచ్చే డిబెంచర్లలో ఇన్వెస్ట్ చేయొచ్చా ?

బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేస్తే.. ఇప్పుడు వచ్చే ఫిక్సెడ్ డిపాజిట్ రేట్లు 7 శాతానికి మించి లేవు. అది కూడా లాంగ్ టర్మ్ ఫిక్సెడ్ డిపాజిట్లు అయితేనే. స్టాక్ మార్కెట్లు చూస్తేనేమో ధైర్యం లేదు. బంగారంలోపెట్టుబడి పెడ్తామంటే పది గ్రాములు రూ.40 వేల మార్కు దగ్గరకు చేరుకుంటోంది. రియల్ ఎస్టేట్ వైపు చూద్దామంటే.. జనాలంతా అధిక మాంద్యమని భయపెడ్తున్నారు. మరి ఇప్పుడు పెట్టుబడి ఆప్షన్స్ ఏమేం ఉన్నాయి ? ఈ మధ్య పేపర్లలో ఎక్కువగా కనిపిస్తున్న నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ బెస్ట్ ఆప్షనా ? 9-10 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్న వీళ్లు వడ్డీతో పాటు అసలును కూడా తిరిగి ఇవ్వగలరా ?

ఏంటీ ఎన్.సి.డి.ల కహానీ!.. మార్కెట్లో వీటి హంగామా

ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలన్నీ నిధుల వేటలో భాగంగా క్యూ కట్టాయి. ప్రధానంగా ఆరు సంస్థలు ఎన్.సి.డిలకు వచ్చాయి. ఎన్.సి.డి.లు అంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. వీటిని ఈక్విటీ షేర్లుగా మార్చే అవకాశం లేదు. వీటికి ఓ నిర్దిష్టమైన కూపన్ రేట్ ఉంటుంది. వీటి ఖచ్చితమైన మెచ్యూరిటీ సమయం కూడా ఉంటుంది. అధిక శాతం డిబెంచబర్స్.. ట్రేడింగ్ కోసం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేస్తారు. అయితే లిక్విడిటీ మాత్రం ఎక్కువగా ఉండదు. అంటే అత్యవసరమైనప్పుడు వెంటనే వీటిని క్యాష్ చేసుకోవడం కుదరకపోవచ్చు.

ఎంత వడ్డీని ఇస్తున్నాయ్ ?

ఎంత వడ్డీని ఇస్తున్నాయ్ ?

ఇప్పుడు వచ్చిన ఆరు కంపెనీలు తమ డిబెంచర్లకు 8.45 నుంచి 10.2 శాతం వరకూ కూపన్ రేట్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఇది బ్యాంక్ వడ్డీతో పోలిస్తే.. మూడు, నాలుగు శాతం వరకూ అధికం. అయితే వీటిని పూర్తిగా నమ్మేసి డబ్బులు కుమ్మరించేయవచ్చా అనే నిర్ణయం తీసుకునేందుకు కొన్ని రిస్కులను పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు జెఎం ఫైనాన్షియల్, శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్, టాటా క్యాపిటల్ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ఇంత వడ్డీ రేట్లు తర్వాత సాధ్యమా

ఇంత వడ్డీ రేట్లు తర్వాత సాధ్యమా

ఎన్.సి.డిలను ఆఫర్ చేస్తున్న సంస్థలన్నీ వినియోగ ఆధారిత వ్యాపారంలో ఉన్న సంస్థలే. అయితే ఒక వేళ ఆర్థిక వ్యవస్థ కాస్త ఇబ్బందుల్లోకి వెళ్తే వీటికి కాస్త రిస్క్ ఉండొచ్చనే వేదన ఉంది. ఆర్బీఐ లెక్కల ప్రకారమే జీడీపీ వృద్ధి రేటు నీరసిస్తోంది. 7 నుంచి వృద్ధిని 6.9 శాతానికి ఆర్బీఐ తగ్గించింది.

ఇక్కడి నుంచి చూస్తే.. ఆర్బీఐ వడ్డీ రేట్లను మరింతగా తగ్గించే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే ద్రవ్యోల్బణం అందుబాటులో ఉంది. లిక్విడిటీ సమస్యలు కూడా అధికంగా లేకపోవడంతో ఆర్బీఐ మరో పావు నుంచి అర శాతం వరకూ వడ్డీ రేట్లలో కోత విధించవచ్చు. ఈ లెక్కన బ్యాంకుల కంటే ఇవి ఖచ్చితంగా వడ్డీల విషయంలో ఎక్కువే. కానీ ఒక వేళ ఆర్థిక మాంద్యం వంటిది వస్తే.. మొదట కన్స్యూమర్ ఫైనాన్సింగ్, ఆటోమొబైల్ వంటి రంగాలకు ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే వీటికి రిస్క్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపధ్యంలో డిబెంచర్లలో అత్యధిక రిస్క్ దాగి ఉంది. రెండు, మూడు శాతం అధిక వడ్డీకి ఆశ పడితే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇంకో విషయం ఏంటంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో 8 నుండి 10 శాతం వడ్డీని ఇస్తున్న కంపెనీలు భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో వడ్డీని ఇస్తాయనే నమ్మకం ఉండకపోవచ్చు. అందుకే అత్యధిక రిస్క్ తీసుకునే వాళ్లు మాత్రమే డిబెంచర్ల జోలికి వెళ్లండి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here