1,03,163 దోస్త్‌కు వచ్చిన దరఖాస్తులు – రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మరో రెండు రోజులు (జూన్ 5 & జూన్ 6)

1
236

హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కోరుతూ 1,10,960 మంది విద్యార్థులు అథెంటికేషన్ చేసుకోగా వారిలో 1,03,163 మంది దోస్త్ రిజిస్ట్రేషన్ కోసం ఫీజులు చెల్లించారని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు.

మొదటి దశ అడ్మిషన్స్ దోస్త్ ఆన్లైన్ ప్రక్రియ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మరో రెండు రోజులు (జూన్ 5 & జూన్ 6) గడువు పెంచారు. కావున ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని విష్యార్థులు చేసుకోవాలని విజ్ఞప్తి.

తాజా నిర్ణయంతో గురువారానికి వరకు దరఖాస్తుకు గడువు ఉందన్నారు.

దోస్త్ రిజిస్ట్రేషన్‌కోసం ఫీజులు చెల్లించినవారిలో 93,687 మంది వెబ్‌కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించారని, వారిలో 82,884 మంది వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారని చెప్పారు. కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతూ వారికి ఎస్‌ఎంఎస్ సమాచారం అందిస్త్తామన్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here