11న ఎన్నికలు

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని బాపూజీ వాచనాలయ కార్యవర్గ ఎన్నికలు ఆగష్టు 11న నిర్వహించనున్నట్టు ఎన్నికల అధికారులు శ్రీహరి ఆచార్య, జగన్‌మోహన్‌ గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఐదేళ్ళకోసారి జరిగే ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవులతో పాటు తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఆగష్టు 2,3 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 4న పరిశీలన, 5న ఉపసంహరణ చేసుకోవాలని సూచించారు. ఆగష్టు 11న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్యం 2 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారన్నారు. ఎన్నికల్లో సభ్యులందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here