12న పల్లెటూరోళ్లం పాటల విడుదల

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంగీత్‌ కల్చరల్‌ అకాడమి 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 12వ తేదీ సోమవారం పల్లెటూరోళ్ళం, రాజఛాహం పాటల విడుదల ఉంటుందని అకాడమి ప్రతినిధులు తెలిపారు. నిజామాబాద్‌ రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి అవార్డులు ప్రదానం చేయనున్నట్టు చెప్పారు. ముఖ్య అతిథులుగా ప్రజాకవి, సినీ గేయరచయిత గోరెటి వెంకన్న, మానకొండూరు ఎమ్మెల్యే, కవి, రసమయి బాలకిషన్‌ పాల్గొంటారన్నారు. అలాగే ప్రత్యేక అతిథులుగా ఎవరెస్టు అధిరోహకురాలు మాలవత్‌ పూర్ణ, సినీ గాయకురాలు వారిపల్లి వరలక్ష్మి విచ్చేస్తారని తెలిపారు. కవులు, కళాకారులు, రచయితలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here