13 ఏళ్ల తరువాత మళ్లీ మెగాస్టార్‌తో..!

0
0


సైరా నరసింహారెడ్డితో మరో బిగ్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను లాంచనంగా ప్రారంభించాడు చిరు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది.

ఈ సినిమాలో మెగాస్టార్‌కు జోడిగా ఓ సీనియర్‌ హీరోయిన్‌ను ఫిక్స్ చేశారు. కోలీవుడ్‌లో ఇంట్రస్టింగ్‌ సినిమాలతో ఆకట్టుకుంటున్న క్రేజీ బ్యూటీ త్రిష ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటించనుంది. గతంలో వీరిద్దరు స్టాలిన్‌ సినిమాలో కలిసి నటించారు. మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2006లో రిలీజ్‌ అయ్యింది. ఇప్పుడు 13 ఏళ్ల తరువాత ఈ కాంబినేషన్‌ మళ్లీ రిపీట్ అవుతోంది.
Also Read: పూజాతో బోనీ మీటింగ్‌: Pawan Kalyan కోసమా.. అజిత్‌ కోసమా..?

మహేష్ బాబు హీరోగా భరత్‌ అనే నేను సినిమా తెరకెక్కించిన కొరటాల శివ తరువాత చిరు సినిమా కోసం లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నాడు. చాలా రోజుల స్క్రిప్ట్ వర్క్‌ తరువాత ఇటీవలే సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను కూడా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నాడు.
Also Read: క్రేజీ కాంబినేషన్‌… ముచ్చటగా మూడోసారి

ఇక చిరు హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా దేశవ్యాప్తంగా 180 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ రిలీజ్ అయ్యింది. అయితే సౌత్‌లో సూపర్‌ హిట్ అయిన సైరా, ఉత్తరాది ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. దీంతో సైరా నరసింహారెడ్డి ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది.
Also Read: ‘ప్రతిరోజూ పండగే’ టైటిల్ సాంగ్: మరోసారి ఆకట్టుకున్న తమన్

త్రిష కెరీర్ ప్రస్తుతం ఫుల్‌ ఫాంలో ఉంది. ఒక దశలో పెళ్లి చేసుకొని పర్సనల్‌ లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలని భావించిన త్రిష, ఆ పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోవటంతో తిరిగి కెరీర్‌ మీద దృష్టి పెట్టింది. గ్లామర్‌ రోల్స్‌ చేస్తూనే లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో అలరిస్తోంది. ప్రస్తుతం తమిళ్‌లో ఫుల్‌ బిజీగా ఉన్న త్రిష గర్జనై, శతురంగ వేట్టై 2, పరమపథం విలయట్టు, రాంగీ, సుగర్‌ సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here