15ఏళ్లతరువాతరక్తనిధి

0
4


రక్తనిద్దికి.. కొత్త పరికరాలు

15ఏళ్లతరువాతరక్తనిధి

అందుబాటులోకి రూ.20 లక్షల పరికరాలు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం


ఇటీవల ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాలు

జిల్లా ప్రభుత్వాస్పత్రి రక్తనిధికి ఎట్టకేలకు కొత్త పరికరాలు వచ్చాయి. పదిహేనేళ్ల క్రితం సరఫరా చేసిన పరికరాలతో ఇంతకాలం నెట్టుకొచ్చారు. ఇటీవల పూర్తిగా పాడైపోవడంతో రోగులు ప్లేట్‌లెెట్ల కోసం ప్రైవేటుకు పరుగులు పెట్టేవారు. రక్తస్రావం, కాలిన గాయాలు, రక్తహీనత రోగులకు అవసరమైన కాంపోనెంట్లు వేరు చేసే పరికరాలు లేకపోవడంతో పరిస్థితి అధ్వానంగా ఉండేది. ఈ విషయంపై ‘ఈనాడు’ వరుస కథనాలు ప్రచురించడంతో యంత్రాంగంలో కదలిక వచ్చింది.

రక్తనిధికి వచ్చిన అత్యాధునిక పరికరాలు

ప్రైవేటుకు పరుగులు అవసరం లేదు

జిల్లా ఆసుపత్రిలో నెలకు 700 పైగా ప్రసవాలు జరుగుతుంటాయి. గర్భిణులకు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. వారికి అవసరమైన ప్యాక్డ్‌సెల్స్‌ లేకపోవడంతో రోజూ సిబ్బందితో గొడవలు జరిగేవి. డెంగీ బాధితులకు అవసరమైన ప్లేట్‌లెట్లు దొరకకపోవడంతో అనేక మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకొని హైదరాబాద్‌కు పరుగులు తీసేవారు. ఇకపై ఈ పరిస్థితి ఉండదు.

ప్రత్యేక పరికరాల గదిని ప్రారంభిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్‌ దీన్‌దయాళ్‌ బంగ్‌

ఒక్క ప్యాకెట్‌తో అనేక ఉపయోగాలు

ఒక రక్తం ప్యాకెట్‌ అనేక మందికి ఉపయోగపడుతుంది. ఒక దాన్నుంచి వివిధ పరికరాల ద్వారా అవరమైన కాంపోనెంట్లు వేరు చేస్తారు. డెంగీతో వచ్చే వారికి ప్లేట్‌లెట్లు, రక్తహీనత ఉన్న వారికి ప్యాక్డ్‌సెల్స్‌, కాలినగాయాలతో చికిత్స పొందుతున్న వారికి ప్లాస్మా అవసరమవుతాయి. ఇన్ని రోజులు పరికరాలు లేక ప్రైవేటు ఆస్పత్రులకు పంపేవారు. మూడు రోజుల క్రితం రూ.20 లక్షలు విలువ చేసే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here