15 ఏళ్ల బాలుడిని 20 సార్లు రేప్ చేసి.. కవల పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

0
3


మహిళ 15 ఏళ్ల బాలుడిని లోబరుచుకుని పదే పదే అత్యాచారానికి పాల్పడింది. ఫలితంగా ఆమె పెళ్లి కాకుండానే కవల పిల్లలకు జన్మనిచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా బాధితుడు కొన్ని షాకింగ్ నిజాలు చెప్పాడు.

సంచలనంగా మారిన ఈ ఘటన ఫ్లొరిడాలోని ఓర్నాల్డోలో చోటుచేసుకుంది. బాధితుడు కోర్టుకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్ప్రింగ్ టర్నర్ అనే 41 ఏళ్ల మహిళ.. తన ఇంటి వద్ద నివసిస్తున్న 15 ఏళ్ల బాలుడిని లోబరుచుకుంది. తనతో సెక్స్ చేయకపోతే అతడి సోదరుడిని ఉద్యోగం నుంచి తీయించేస్తానని, ఇంటి నుంచి బయటకు పంపించేసేలా చేస్తానని బెదిరించింది. ఆ తర్వాత బాధితుడిని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేది. ఈ సందర్భంగా ఆమె అతడికి వయాగ్రా ఇచ్చేది. గత రెండేళ్లలో ఆమె దాదాపు 20 సార్లు అతడిపై అత్యాచారానికి పాల్పడింది.

Also Read: మగ పిల్లలే టార్గెట్.. 33 మందిని రేప్ చేసి చంపేసి, తన గదిలోనే పూడ్చేసిన జోకర్!

అయితే, ఈ విషయాన్ని బాధితుడు ఓ రోజు బయటకు చెప్పలేదు. ఆ బాధితుడి ఫ్యామిలీ ఫ్రెండ్‌కు టర్నర్ తీరుపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. విచారణలో ఆమె అతడు ఇష్టపూర్వకంగానే తనతో సెక్స్ చేసేవాడని, తనని అత్యాచారం చేయలేదని పేర్కొంది. అప్పటికి అతడి వయస్సు 17 ఏళ్లని తెలిపింది. అయితే, ఫ్లొరిడాలో 18 ఏళ్లు నిండిన వ్యక్తులతో మాత్రమే సెక్స్ చేయాలనే నిబంధన ఉంది. బాధితుడికి 17 ఏళ్లు కావడంతో పోలీసులు అత్యాచారం కేసుగా నమోదు చేశారు.

Also Read: లారీలో 39 శవాలు.. కంటతడి పెట్టిస్తున్న ఆఖరి మెసేజ్, ఆ మరణాలకు కారణాలివే!

ఆమె వివాహం కాకపోవడం, మరే వ్యక్తులతో సంబంధం లేకుండా కవల పిల్లలకు జన్మనివ్వడంపై స్థానికులకు ఆశ్చర్యం కలిగింది. ఈ సందర్భంగా పోలీసులు ఆ కవల పిల్లలకు డీఎన్ఏ పరీక్షలు చేయించారు. రిపోర్టుల్లో ఆ బాలుడే వారికి తండ్రని తేలింది. ప్రస్తుతం ఈకేసు విచారణలో ఉంది. టర్నర్‌కు 30 ఏళ్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానా, లేదా రెండూ విధించే అవకాశాలు ఉన్నాయి.

Also Read: లిఫ్ట్ ఇస్తాడు, హత్యచేసి శవాలను రేప్ చేసి.. తినేస్తాడు, తల్లినీ వదలని రాక్షసుడు!Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here