150 ఏళ్ల చెట్టు చుట్టూ నాలుగంతస్తుల భవనం

0
1


150 ఏళ్ల చెట్టు చుట్టూ నాలుగంతస్తుల భవనం

ఆకట్టుకుంటున్న వృక్ష సౌధం

ఇంటర్‌నెట్‌డెస్క్‌: ప్రాణి భూమి మీద అడుగు పెట్టినప్పటి నుంచి చెట్టు ఓ మంచి స్నేహితుడిలా అడుగడుగునా తోడుగా నిలుస్తుంది. ప్రాణవాయువు అందించడం, తినేందుకు పండ్లు, ఆహారం, ఎండ వేడిమి నుంచి ఉపశమనం ఇవ్వడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాణకోటి మనుగడలో చెట్ల ప్రాధాన్యత అంతాఇంతా కాదు. చెట్ల విలువ తెలుసుకోకుండా అడవులను విచ్చలవిడిగా నరికేస్తుండడంతో ప్రపంచ దేశాలు గ్లోబల్‌ వార్మింగ్‌ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీని నుంచి బయట పడాలంటే ప్రతి ఒక్కరూ చెట్ల ప్రాధాన్యత తెలుసుకొని వాటి సంరక్షణకు పాటుపడాలి. 


 

అలా ఓ చెట్టు ప్రాధాన్యతను గుర్తించింది జబల్‌పూర్‌కు చెందిన ఓ కుటుంబం. ఆ వివరాల్లోకెళ్తే… జబల్‌పూర్‌కు చెందిన కేశర్వాని కుటుంబం 1994లో తమ ఇంటి నిర్మాణాన్ని విస్తరించాలనుకుంది. ఆ సమయంలోనే ఇంటి ఆవరణలోని తోటలో ఓ పెద్ద చెట్టు విస్తరణ పనులకు అడ్డుగా ఉండటాన్ని గుర్తించారు. అందరూ చర్చించుకున్న అనంతరం చెట్టును నరకకుండా ఇంటి నిర్మాణాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా చెట్టును ఏమాత్రం కదిలించకుండా ఏకంగా నాలుగు అంతస్తుల్లో ఇంటిని నిర్మించారు. మొదట్లో దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా క్రమంగా అలవాటు పడ్డామని ఇంటి యజమాని యోగేశ్‌ కేశర్వాని చెబుతున్నారు. 

150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చెట్టు ఇప్పటికీ ప్రతి ఏడాది కొమ్మలు, ఆకులు, పండ్లతో అందర్నీ ఆకట్టుకుంటోందని ఆయన అన్నారు. ప్రస్తుతం అది తమ జీవితంలో భాగమైపోయిందని, తమ కుటుంబసభ్యుల్లో ఒకటిగా భావిస్తున్నామని ఆయన అన్నారు. చెట్టు చుట్టూ నిర్మించిన ఈ ఇల్లు అద్భుత కట్టడంగా జబల్‌పూర్‌లోనే ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 

Tags :

  • jabalpur
  • 150 years old treeSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here