15,000 ప్లాస్టిక్‌ బాటిల్స్‌తో ‘వాల్‌ ఆఫ్‌ హోప్‌’

0
3


15,000 ప్లాస్టిక్‌ బాటిల్స్‌తో ‘వాల్‌ ఆఫ్‌ హోప్‌’

పర్యావరణ పరిరక్షణపై ముస్సోరి ప్రజల ఆసక్తి

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముస్సోరి ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఓ అందమైన పర్యాటక ప్రాంతం. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులతో పాటు ఇతర దేశాలకు చెందిన పర్యాటకులు సైతం ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ప్రకృతి ప్రేమికులను ఈ ప్రాంతం కట్టిపడేస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. ఎత్తైన కొండలు, చల్లని వాతావరణం ఇక్కడికి వచ్చే పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ముస్సోరి దేశంలోనే పేరుగాంచిన హిల్‌ స్టేషన్‌. దిల్లీ, పంజాబ్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు లాంగ్‌ వీకెండ్‌ వచ్చిందంటే చాలు ఇక్కడ వాలిపొయ్యేందుకు మక్కువ చూపుతారు. 
ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ప్రాంత పర్యావరణ పరిరక్షణ కోసం ఓ అడుగు ముందుకేసి మంచి సందేశాన్ని అందిస్తున్నారు స్థానిక ప్రజలు. అదే ‘వాల్‌ ఆఫ్‌ హోప్‌’. దీని సృష్టికర్తలు ముస్సోరి ప్రాంత ప్రజలే. 12 అడుగుల ఎత్తు, 1500 అడుగుల పొడవు ఉన్న ఈ వాల్‌ ఆఫ్‌ హోప్‌ను 15,000 ప్లాస్టిక్‌ బాటిల్స్‌తో నిర్మించారు. ముస్సోరితో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను ఇందుకోసం సేకరించారు.

 

ఇక్కడకు వచ్చిన పర్యాటకులు ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకుండా అవగాహన కల్పించేందుకు ముస్సోరి ప్రాంత ప్రజలు చేసిన చిన్న ప్రయత్నమే ఈ ’వాల్‌ ఆఫ్‌ హోప్‌’. గోవా మ్యూజియం వ్యవస్థాపకుడైన సుబోధ్ కేర్కర్‌ ఈ ఆలోచనకు రూపకల్పన చేశారు. ముస్సోరిని దేశంలోనే పరిశుభ్రమైన హిల్‌ స్టేషన్లలో ఒకటిగా నిలబెట్టేందుకు హిల్‌దారి ఉద్యామాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ వాల్‌ నిర్మించారు. 
హిల్‌దారి ప్రాజెక్ట్‌ మేనేజర్‌ అర్వింద్‌ శుక్లా మాట్లాడుతూ.. హోప్‌ ఆఫ్‌ వాల్‌ నిర్మాణానికి వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన 50 మంది వాలంటీర్లు ముందుకు వచ్చారన్నారు. స్థానిక ప్రజలు సైతం ఇందులో చురుకైన పాత్ర పోషించారని ఆయన తెలిపారు. వారందరి కృషి ఫలితంగానే ఈ దీన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ముస్సోరి సమీపంలోని బంగ్లాకి కండి ప్రాంతానికి చెందిన గ్రామ్‌ ప్రధాన్‌ రీనా రెంగల్‌ దీన్ని ప్రారంభించారు. 
వాల్‌ ఆఫ్‌ హోప్‌ నిర్మించిన తీరు తమకు బాగా నచ్చిందని, ఇప్పుడు తమ గ్రామం మరింత అందంగా కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. దీని నుంచి ప్రజలు ఎంతో నేర్చుకోవచ్చని, ప్లాస్టిక్‌ వ్యర్ధాలను ఉపయోగించుకోవడంలో ఇదో ప్రత్యేకమైన పద్ధతని వారు పేర్కొంటున్నారు.

Tags :

  • mussoorie
  • hill station
  • travellersSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here