18 నెలల్లో 10 లక్షల యోనో క్యాష్ కౌంటర్లు.. ఎస్‌బీఐ కీలక నిర్ణయాలు

0
0


18 నెలల్లో 10 లక్షల యోనో క్యాష్ కౌంటర్లు.. ఎస్‌బీఐ కీలక నిర్ణయాలు

జైపూర్ : డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. దానికి అనుగుణంగా ప్రణాళిక రచిస్తోంది ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ . ఈ మేరకు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. జైపూర్‌లో జరిగిన ఓ సమావేశంలో ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ .. కీలక నిర్ణయాలను వెల్లడించారు. యోనో క్యాష్ పాయింట్లను పెంచుతామని పేర్కొన్నారు. ఆటోరంగం అనిశ్చితికి గల కారణం అన్వేషించాల్సి ఉందని పేర్కొన్నారు.

యోనో క్యాష్ పాయింట్ల సంఖ్యను మరింత పెంచుతామని రజనీశ్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70 వేల క్యాష్ పాయింట్లు ఉన్నాయని వివరించారు. వచ్చే 18 నెలల్లో అవి 10 లక్షలకు చేరతాయని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరిగడం వల్ల .. డెబిట్ కార్డు వాడకం తగ్గిపోతుందని అపోహ లేదన్నారు. అలాగే డెబిట్ కార్డులను నిలిపివేసే యోచన కూడా తమకు లేదన్నారు.

ఆటోరంగం తిరోగమనానికి గల కారణాలను కనుక్కొవాల్సి ఉందన్నారు. ఉద్యోగాల్లో అనిశ్చిత వల్ల వినియోగదారులు తమ సొంత కార్లను కొనుగోలు చేయడం లేదన్నారు. క్యాబ్, అద్దెకార్లకే మొగ్గుచూపుతున్నారని వివరించారు. అయితే ఇది ఎప్పటివరకు ఉంటుందనే అంశంపై క్లారిటీ లేదన్నారు. దానిపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here