24న బాలగోకులం

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంస్కారభారతి, ఇందూరు ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్బంగా బాలగోకులం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరేందర్‌ భాయ్‌షా, గంట్యాల ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని స్థానిక మున్నూరు కాపు సంఘం కల్యాణమండపం, శివాజీనగర్‌లో కార్యక్రమం ఉంటుందన్నారు. 5 సంవత్సరాలలోపు చిన్నారులు బాలకృష్ణుని వేషధారణలో పాల్గొనాలని, అదేవిధంగా ఒక శ్లోకం లేదా సూక్తి చెప్పాలని సూచించారు. బాలగోకులం ద్వారా శిశుప్రాయంలోనే పిల్లలకు సంస్కారం నేర్పించాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. బాలకృష్ణుని వేషధారణలో పాల్గొను వారికి దృవపత్రం, ఉత్తమ ప్రదర్శనలకు జ్ఞాపికలు అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా నరేందర్‌భాయ్‌షా, ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త పురుషోత్తం సోమాని, విశిష్ట అతిథిగా సంస్కారభారతి అఖిలభారత ప్రముఖులు మేడిశెట్టి కుమారస్వామి తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. కళాభిమానులు, పురప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here