24 ఏళ్ల కుర్రాడు.. రాత్రికి రాత్రే బిలియనీర్ అయిపోయాడు!

0
2


24 ఏళ్ల కుర్రాడు.. రాత్రికి రాత్రే బిలియనీర్ అయిపోయాడు!

బాగా డబ్బు సంపాదించాలని, ఆ డబ్బుతో ఏవేవో చేసేయాలని అందరికీ ఉంటుంది. కొంతమందికి అదృష్టం కలిసి వచ్చి.. ఏదో లాటరీ టిక్కెట్ ద్వారా పెద్దగా కష్టపడకుండానే లక్ష్మీదేవి నట్టింట్లోకి నడిచి వచ్చేస్తుంది. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఇలా జరగకపోవచ్చు.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే.. పాతికేళ్ల వయసు కూడా లేని కుర్రాడు రాత్రికి రాత్రే బిలియనీర్ అయిపోయాడు. ఏం చేశాడు? ఎలా సంపాదించేశాడు? అని అడక్కండి. ఎందుకంటే.. తాను బిలియనీర్ అయిపోయానన్న విషయం అతడి ఆప్తులు చెప్పేంత వరకు అతడికి కూడా తెలియదు మరి.

చైనా యువకుడు…

అతడి పేరు ఎరిక్ టీసే. వయసు 24 ఏళ్లు. ఎరిక్.. చైనాలోని ఓ ధనవంతుల కుటుంబానికి చెందిన కుర్రాడు. ఇతడి తల్లిదండ్రులు ఓ బయో ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఆ కంపెనీ పేరు ‘సినో’. ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు అంటే.. మంచి హోదా, ఆ హోదాకి తగ్గ వేతనం, ఇతర సౌకర్యాలు ఉంటాయి కదా? అలా ఎరిక్ టీసేది పుట్టినప్పట్నించే లగ్జరీ లైఫ్ అన్నమాట.

రాత్రికి రాత్రే బిలియనీర్‌గా...

రాత్రికి రాత్రే బిలియనీర్‌గా…

అలాంటి ఎరిక్ టీసే జీవితంలో ఇటీవల ఓ అద్భుతం చోటుచేసుకుంది. దాంతో అతడు రాత్రికి రాత్రే బిలియనీర్‌గా మారిపోయాడు. ఇప్పుడు అతడి సంపద 3.8 బిలియన్ డాలర్లు. దాంతో చైనాలోని సంపన్న వ్యక్తుల జాబితాలోనే కాదు.. ఏకంగా ప్రపంచంలోనే సంపన్న వ్యక్తుల జాబితాలోకి మనోడు ఎంట్రీ ఇచ్చేశాడు. విచిత్రం ఏమిటంటే.. ఆ విషయం ఆ కుర్రాడికి కూడా తెలియదు.

అసలేం జరిగిందంటే...

అసలేం జరిగిందంటే…

ఎరిక్ టీసే తల్లిదండ్రులు ఓ పెద్ద బయో ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు అని చెప్పుకున్నాం కదా? ఆ బయో ఫార్మాస్యూటికల్ కంపెనీ ‘సినో’ని స్థాపించింది కూడా అతడి తండ్రే. ఆయన పేరు టీసే పింగ్, అతడి తల్లి పేరు చెంగ్ చ్యూంగ్ లింగ్. వారిద్దరూ ఇటీవల కంపెనీలోని తమ వాటాలో అయిదో వంతును తమ కుమారుడు ఎరిక్ టీసేకి బదిలీ చేశారు.

షేర్లతోపాటు కంపెనీలో...

షేర్లతోపాటు కంపెనీలో…

ఎరిక్ తల్లిదండ్రులకు ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీలో 8.5 బిలియన్ డాలర్ల వాటా ఉంది. దాంట్లోంచి వారు 450,000,000 షేర్లను, 2,250,000,000 స్టాక్స్‌ను అతడి పేర బదిలీ చేశారు. దీంతో 24 ఏళ్ల వయసుకే.. రాత్రికి రాత్రే ఎరిక్ టీసే బిలియనీర్ల జాబితాలోకి వచ్చేశాడు. అంతేకాదు, తమ కుమారుడిని వారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, కంపెనీ ఎగ్జిక్యూటివ్ బోర్డు కమిటీలో మెంబర్‌గా కూడా నియమించేశారు.

అమెరికా అధ్యక్షుడినే మించిపోయేంత...

అమెరికా అధ్యక్షుడినే మించిపోయేంత…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలుసు కదా? ప్రస్తుతం ట్రంప్ సంపద 3.1 బిలియన్ డాలర్లు. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఎరిక్ టీసే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని కూడా మించిపోయాడు. ఎందుకంటే.. ఇప్పుడు ఎరిక్ సంపద అక్షరాలా 3.8 బిలియన్ డాలర్లు. ఈ సంపద మొత్తాన్ని అతడి తల్లిదండ్రులు అతడికి గిఫ్ట్ కింద ఇచ్చేశారు. ఈ మేరకు సినో బయో ఫార్మాస్యూటికల్ కంపెనీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

 ఎరిక్ మనసున్న కుర్రాడు...

ఎరిక్ మనసున్న కుర్రాడు…

సాధారణంగా తాము రాత్రికి రాత్రే బిలియనీర్ అయిపోతే.. ఎవరికైనా ఎలా అనిపిస్తుంది? ముందు షాక్ అవుతారు. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి కొంత సమయం కూడా పడుతుంది. ఇక ఆ తరువాత ఆ సంపదను ఏం చేయాలి? ఎలా అనుభవించాలి? ఇలా రకరకాల ప్రణాళికలు వేసుకుంటారు. కానీ ఎరిక్ టీసే మాత్రం కాస్త డిఫరెంట్. తన పేరును బిలియనీర్ల జాబితాలో చేర్చవద్దని, అది తనకు ఇష్టం లేదని, అంతగా కుదరదంటే.. ప్రపంచ కుబేరుల జాబితాలో టీసే పింగ్ ఫ్యామిలీ పేరును చేర్చాలని అతడు కోరాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here