24/7 ఎప్పుడైనా: ఇక రోజులో ఎప్పుడైనా మనీ ట్రాన్స్‌ఫర్: RBI

0
0


24/7 ఎప్పుడైనా: ఇక రోజులో ఎప్పుడైనా మనీ ట్రాన్స్‌ఫర్: RBI

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్‌ను ప్రోత్సహించేందుకు నెఫ్ట్ వేళల్లో మార్పులు చేసింది. ఇక డిసెంబర్ నుంచి రోజులో ఎప్పుడైనా నగదు లావాదేవీలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా మళ్లీ రెండు, నాలుగో శనివారాల్లో సేవలు ఉండవు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించిన పేమెంట్ సిస్టమ్ విజన్ డాక్యుమెంట్ 2021ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో డిసెంబర్ 2019 నుంచి నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్) సేవలు రోజులో 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. 24X7 అందుబాటులో ఉండే ఈ సేవల ద్వారా దేశ రిటైల్ పేమెంట్ సిస్టమ్‌.. పూర్తిస్థాయిలో మారబోతోందని ఆర్బీఐ భావిస్తోంది.

ఎందుకంటే.. సాయంత్రం వేళల్లో డబ్బులు ఇతర ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసే సౌలభ్యం లేదు. మరుసటి రోజు వరకూ ఆగాల్సి ఉండేది. దీంతో చాలా మంది సాయంత్రం తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్‌కే ఎక్కువగా మొగ్గుచూపేవారు. ప్రధానంగా వ్యాపారస్థులకు ఇది మరింతగా లబ్ధి చేకూర్చబోతోంది. గూగుల్ పే, అమెజాన్ వంటి యూపీఐ సేవలు ఉన్నా జనాలు ఇప్పటికీ బ్యాంకుల ద్వారా నగదు లావాదేవీలు జరిపేందుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఈ నేపధ్యంలో ఆర్బీఐ తీసుకున్న ఈ చర్య బ్యాంకింగ్ రంగంలో మరిన్ని మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here