28న బిసి ఐక్యవేదిక సదస్సు

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లా బిసి, ఎంబిసి కులాలు ఐక్యవేదిక జిల్లా సదస్సు ఈనెల 18న నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా ఎంసిపిఐయు ప్రజా సంఘాల బాద్యులు రాజలింగం తెలిపారు. ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ కామారెడ్డి బిసి కులాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ప్రభుత్వం జస్టిస్‌ ఈశ్వరయ్య కమిషన్‌, జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌లు సూచించిన ప్రకారం బీసీ కులాల జాబితా కులాల వారీగా జనాభా లెక్కలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం ఇప్పుడే 52 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉండగా గతంలో పైన 34 శాతం రిజర్వేషన్లు తగ్గించి 18 శాతానికి కుదించడం బీసీలను నిట్ట నిలువునా మోసం చేయడమేనని అన్నారు.దీన్ని ఎదుర్కొనేందుకు బీసీల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం సాధించుకునేందుకు బిసి, ఎంబిసి కులాల వారందరు, ఎస్సీ, ఎస్టీలతో కలిసి పోరాటాలు నిర్వహించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఇందుకోసం బీసీ కులాల ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా కమిటీ ఏర్పాటు కోసం ఈ నెల 18న తలపెట్టిన జిల్లా సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో తిరుపతి, ఎల్లయ్య, మల్లేష్‌, యాదగిరి, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here