28 లోగా గ్రీన్‌ ప్లాన్‌ పూర్తిచేసుకోవాలి

0
3నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల కార్యాచరణ కార్యక్రమాలలో భాగంగా ఈనెల 28వ తేదీలోగా గ్రీన్‌ ప్లాన్‌ పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులు , గ్రామ పంచాయతీ సెక్రెటరీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక, హరితహారం కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రీన్‌ ప్లాన్‌ కార్యక్రమానికి సంబంధించి గ్రామంలో ఇంటింటికి కావలసిన మొక్కల వివరాలు, రైతులకు కావలసిన మొక్కల వివరాలు ఈనెల 28వ తేదీలోగా పూర్తి చేసుకోవాలని తెలిపారు. కార్యాచరణ కార్యక్రమాలలో హరిత హారంలో మిగిలిన మొక్కలను నాటి లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. 2019- 20 హరితహారం కార్యక్రమంలో భాగంగా నర్సరీలలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. కొత్తగా మొక్కలు పెంచాలని, మిగిలిన మొక్కలకు రక్షణ చేపట్టాలని, పెద్ద మొక్కల కోసం బ్యాగులు మార్పిడి చేసుకోవాలని తెలిపారు. అవెన్యూ ప్లాంటేషన్‌ కోసం, గ హ అవసరాల కోసం, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు తదితర వాటిని పరిగణలోకి తీసుకొని డిమాండ్‌కు అనుగుణంగా మొక్కలు పెంచాలని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 288 డంపింగ్‌ యార్డ్‌లు మంజూరు చేయడం జరిగిందని, ఇంకా 238 మంజూరు చేయాల్సి ఉందని, సంబంధిత మండల అధికారులు వెంటనే ఎస్టిమేషన్‌ తయారు చేసి అప్లోడ్‌ చేయాలని తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here