30 రోజుల ప్రణాళిక పనులు చురుకుగా సాగుతున్నాయి

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళిక ద్వారా గ్రామాల్లో చేపట్టిన పచ్చదనం, పారిశుద్ధ్యం, డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామం, మంకీ ఫుడ్‌ కోర్టుల ఏర్పాట్లు, పవర్‌ వీక్‌ సందర్భంగా శిధిలమైన విద్యుత్‌ స్తంభాలను తీసివేసి కొత్తవి అమర్చడం, వీధి దీపాల కోసం వైరింగ్‌ ఏర్పాటు చురుకుగా సాగుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ తెలిపారు. సోమవారం కలెక్టర్‌ గాంధారి మండలం నేరెళ్ల గ్రామంలో 30 రోజుల కార్యక్రమాలను పరిశీలించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి నీరుపోశారు. గ్రామంలో రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలు తొలగించి, శుభ్రం చేసి చేపట్టిన మొక్కల పెంపకం పనులను చూసి గ్రామస్తులను అభినందించారు. ప్రతి గ్రామంలో ప్రజలు ఉత్సాహంతో పనుల్లో భాగస్వామ్యం అవుతున్నారని అన్నారు. గ్రామాలలో రోడ్ల వెంబడి కంపచెట్లు తొలగించడం, మొక్కలు నాటి వాటికి రక్షణ కల్పించడం, మురికి కాలువలలో పూడిక తీయడం జరుగుతున్నదని తెలిపారు. డంపింగ్‌ యార్డ్‌, వైకుంఠధామం ప్రతి గ్రామంలో తప్పనిసరిగా ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని, లేని గ్రామాలలో వాటిని నెలకొల్పడం జరగుతుందని తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here