30 రోజుల ప్రణాళిక బాగు

0
3


30 రోజుల ప్రణాళిక బాగు


మోపాల్‌ మండలం కులాస్‌పూర్‌లో పరిసరాలు పరిశుభ్రం చేస్తున్న మహిళలు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగరం : 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు శనివారంతో ముగిసింది. గత నెల 6న కార్యక్రమం ప్రారంభం అయ్యింది. పల్లెల్లో పచ్చదనం-పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల్లో ఒకరి చొప్పున ప్రత్యేకాధికారులను నియమించారు. పాలనాధికారి ఎంఆర్‌ఎం రావు, డీపీవో జయసుధతో పాటు ప్రజాప్రతినిధులు ప్రతి నిత్యం గ్రామాల్లో పర్యటించారు. నీటి ట్యాంకులు, మురుగు కాల్వలు శుభ్రం, చెత్త కుప్పలు ఎత్తివేయడం లాంటి పనులు చేపట్టారు.

కార్యక్రమం విజయవంతం: పాలనాధికారి

జిల్లాలో 30 రోజుల ప్రణాళిక ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సమష్టి కృషితో విజయవంతమైందని పాలనాధికారి ఎంఆర్‌ఎం రావు తెలిపారు. గ్రామాల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు.

 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here