370 ఆర్టికల్‌పై సమావేశం

0
3


370 ఆర్టికల్‌పై సమావేశం

భాజపా జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: కాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ రద్దుకు ముందు పరిణామాలు తర్వాతి పరిస్థితిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు జిల్లా కేంద్రంలో అన్ని వర్గాలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి తెలిపారు. ఈ సమావేశం సోమవారం జిల్లా కేంద్రంలోని బస్వాగార్డెన్‌లో ఉదయం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశానికి గుజరాత్‌ పార్లమెంట్‌ సభ్యుడు కిరీటి సోలంకి ముఖ్యఅథితిగా పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశానికి వైద్యులు, విద్యావేత్తలు, మేధావులు, వ్యాపారవేత్తలు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో భాజపా నాయకులు శ్రీనివాస్‌ శర్మ, భరత్‌ భూషణ్‌, యెండల సుధాకర్‌, నాగరాజు, స్వామి యాదవ్‌, నారాయణ యాదవ్‌, జనార్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here