4.5 శాతం మేర పెరిగిన మారుతీ సుజుకీ సేల్స్, మహీంద్రా మాత్రం డల్

0
3


4.5 శాతం మేర పెరిగిన మారుతీ సుజుకీ సేల్స్, మహీంద్రా మాత్రం డల్

ఆటోరంగానికి గుడ్‌న్యూస్! గత కొన్నాళ్లుగా కార్లు, బైక్ సేల్స్ భారీగా పడిపోయి, ఆటోరంగం తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాల కోసం పలు ఉద్దీపన చర్యలు కూడా ప్రకటించింది. ఏడాది కాలంగా తగ్గిన కారు సేల్స్ అక్టోబర్ నెలలో తిరిగి పుంజుకున్నాయి. అయితే మరింతగా పుంజుకోవాల్సి ఉంది. దేశీయ కార్ల దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకీ సేల్స్ గత నెలలో పెరగగా, మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ మాత్రం తగ్గాయి.

పెరిగిన మారుతీ సుజుకీ అమ్మకాలు

మారుతీ సుజుకీ అక్టోబర్ నెల అమ్మకాల్లో 4.5 శాతం వద్ధిని నమోదు చేసి 1.53 లక్షల యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 1.46 లక్షల యూనిట్లను విక్రయించింది. అయితే నోమురా 1.7 లక్షల యూనిట్లు అమ్ముడుపోతాయని అంచనా వేయగా కాస్త తగ్గింది. కానీ గత కొంతకాలంగా నిస్తేజంగా ఉన్న ఆటోరంగానికి ఇది కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేది అని చెప్పవచ్చు.

ఏవి ఎంత శాతం అంటే?

ఏవి ఎంత శాతం అంటే?

టయోటా గ్లాన్జా (బాలెనో) కాకుండా దేశీయ అమ్మకాలు 2.5 శాతం, స్విఫ్ట్, సెలేరియా, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ వంటి కంపాక్ట్ సెగ్మెంట్ సేల్స్ 15.9 శాతం మేర పెరిగాయి. ఆల్టో, వ్యాగనోర్, ఎస్ ప్రెస్పె వంటి మినీ కార్ల అమ్మకాలు 13.1 శాతం తగ్గాయి. గతేడాదితో పోలిస్తే ఎగుమతులు 5.7శాతం పెరిగి 9,158 యూనిట్లు విక్రయించారు. డొమెస్టిక్ సేల్స్ మాత్రం గత ఏడాదితో పోలిస్తే 4.5 శాతం మేర పెరిగినట్లు కంపెనీ ప్రకటించింది.

కంపాక్ట్ కాు సెగ్మెంట్ కార్లది 49 శాతం వాటా

కంపాక్ట్ కాు సెగ్మెంట్ కార్లది 49 శాతం వాటా

ఇయర్ టు ఇయర్ బేస్‌గా పాసింజర్ కారు సేల్స్ 4.4 శాతం పెరిగి 1.06 లక్షల యూనిట్లు విక్రయించారు. మొత్తం కార్ల సేల్స్‌లో కంపాక్ట్ కారు సెగ్మెంట్ కార్లది 49 శాతం. అక్టోబర్ నెలలో వీటి వృద్ధి 15.9 శాతంగా ఉంది. యుటిలిటీ వెహికిల్స్ (ఎర్తిగా, ఎక్ఎల్6, విటారా బ్రెజ్జా) సేల్స్ 11.3 శాతం మేర పెరిగాయి. వ్యాన్లు (ఎకో) సేల్స్ మాత్రం 26.8 శాతం తగ్గాయి.

తగ్గిన మహీంద్రా సేల్స్

తగ్గిన మహీంద్రా సేల్స్

మారుతీ సుజుకీ కార్ల సేల్స్‌లో గ్రోత్ ఉండగా, మహింద్రా అండ్ మహీంద్రా కారు సేల్స్‌లో తగ్గుదల కనిపించింది. 51,896 యూనిట్ల విక్రయాలతో 11 శాతం తగ్గాయి. గత ఏడాది ఇదే నెలలో 58,416 విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఎగుమతులు 12 శాతం, కమర్షియల్ వాహనాల సెగ్మెంట్ 3 శాతం, ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్ 23 శాతం తగ్గుదలను నమోదు చేసింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here