41ఏ సీఆర్‌పీసీ రద్దుకు పోరాటం

0
2


41ఏ సీఆర్‌పీసీ రద్దుకు పోరాటం

మాట్లాడుతున్న కౌన్సిల్‌ సభ్యుడు రాజేందర్‌రెడ్డి

నిజామాబాద్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: 41ఏ సీఆర్‌పీసీి అమలులో దుర్వినియోగం, దాని రద్దుకు పోరాటం చేయడానికి జిల్లాలో జేఏసీ ఏర్పాటు చేస్తామని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆకుల రమేశ్‌ తెలిపారు. 41ఏ బార్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి చర్చించినట్టు పేర్కొన్నారు. ఈ సెక్షన్‌తో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీనికోసం బార్‌ కౌన్సిల్‌, ఫెడరేషన్‌, బార్‌ అసోసియేషన్‌ కలసి కట్టుగా పనిచేయాలని బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు రాజేందర్‌రెడ్డి అన్నారు. త్వరలో జేఏసీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఇందులో న్యాయవాదులు పరుచూరి శ్రీధర్‌, జగదీశ్వర్‌రావు, భాస్కర్‌, రాజు, విఘ్నేశ్‌, ఆశనారయణ తదితరులు ప్రసంగించారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here