57ఏళ్లలో తీవ్ర ఒడిదుడుకుల్లో చైనా, గుడ్డులా పగిలిపోయింది: ట్రంప్ షాకింగ్

0
1


57ఏళ్లలో తీవ్ర ఒడిదుడుకుల్లో చైనా, గుడ్డులా పగిలిపోయింది: ట్రంప్ షాకింగ్

వాషింగ్టన్: అమెరికా – చైనా వాణిజ్య యుద్ధం/చర్చలపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ శనివారం స్పందించారు. చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, అయితే ఈ డీల్ సమంజసంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. బీజింగ్‌తో చాలాకాలంగా వాణిజ్య చర్చలు సాగుతున్నాయని, ఈ చర్చలు సానుకూలంగానే కనిపిస్తున్నాయన్నారు. ఇది అర్థవంతమైన డీల్ అయితే ఓకే అనీ లేదంటే డీల్ కుదరదని కుండబద్దలు కొట్టారు. నేను ఒప్పందం చేసుకోవాలనే అనుకుంటున్నానని, కానీ సరైనది అయి ఉండాలన్నారు.

గుడ్డు పగిలిపోయింది

తమ దేశంతో ఒప్పందం కోసం చైనా ఆసక్తిగా ఉందని ట్రంప్ చెప్పారు. గత 57 ఏళ్లుగా చూడని దారుణమైన పరిస్థితులను చైనా ఇప్పుడు చవి చూస్తోందని చెప్పారు. బీజింగ్ సప్లై చైన్ అంతా కోల్పోయిందన్నారు. ఓ కోడిగుడ్డులా వారి సరఫరా చైన్ పగిలిపోయిందన్నారు. కాబట్టి వారు డీల్ కోసం ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. ఒప్పందం తనకు సమంజసంగా అనిపించాలని, లేదంటే అది వారి ఇష్టమని ఘాటుగా చెప్పారు.

టారిఫ్ వల్ల పదుల కొద్ది బిలియన్ డాలర్లు

టారిఫ్ వల్ల పదుల కొద్ది బిలియన్ డాలర్లు

చైనా వస్తువులపై టారిఫ్ ఎత్తివేసేందుకు అమెరికా సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరిగిందని, కానీ అవి తప్పుడు ప్రచారాలు అని ట్రంప్ చెప్పారు. టారిఫ్ పెంచడం వల్ల అమెరికాకు పదుల బిలియన్ డాలర్ల కొద్ది ఆదాయం వచ్చిందని, ఇది అక్షరాలా వందల బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందన్నారు. టారిఫ్ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, కానీ నేను ఏం చేయబోతున్నానో మీరు చూస్తారన్నారు. టారిఫ్స్‌లలో తేడా ఉందన్నారు.

ట్రంప్ బాంబు.. నేను అలా చేయనని తెలుసు

ట్రంప్ బాంబు.. నేను అలా చేయనని తెలుసు

దశలవారీగా ఒకరి వస్తువులపై మరొకరు సుంకాలు వెనక్కి తీసుకోనున్నామని, ఈ మేరకు చర్చలు సాగుతున్నాయని అంతకుముందు చైనా ప్రకటించింది. దీంతో ఈ వార్తలను ట్రంప్ కొట్టి పారేశారు. చైనా ఉత్పత్తులపై సుంకాలు ఎత్తివేసే దిశగా ఎలాంటి ఒప్పందం కుదరలేదని బాంబు పేల్చారు. టారిఫ్ ఎత్తివేయాలని చైనా కోరుతోందని, అయితే పూర్తిస్థాయి సుంకాల ఎత్తవేతపై మాత్రం వారు చర్చించలేదని స్పష్టం చేశారు. ఎందుకంటే నేను అలా ఎత్తివేయనని వారికి తెలుసునని చెప్పారు.

తీవ్ర ఒడిదుడుకుల్లో చైనా ఆర్థిక వ్యవస్థ

తీవ్ర ఒడిదుడుకుల్లో చైనా ఆర్థిక వ్యవస్థ

ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని అందుకే ఒప్పందానికి ఉబలాటపడుతోందని ట్రంప్ అన్నారు. అంతకుముందు, చైనా వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ… అదనపు టారిఫ్ సుంకాలను దశలవారీగా వెనక్కి తీసుకునేందుకు అమెరికా అంగీకరించిందని, తుది ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు. కానీ ట్రంప్ వ్యాఖ్యలతో మళ్లీ మొదటికి వచ్చింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here