75 గజాల్లోపు ఇంటి నిర్మాణానికి నో పర్మిషన్, అలా చేస్తే భారీ జరిమానా!

0
6


75 గజాల్లోపు ఇంటి నిర్మాణానికి నో పర్మిషన్, అలా చేస్తే భారీ జరిమానా!

హైదరాబాద్: మీరు తెలంగాణలోని మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్నారా? కొద్ది స్థలం మాత్రమే ఉంటే ఇంటిని నిర్మించుకునే ఆలోచనలో ఉన్నారా? అయితే ఇది మీకోసమే. 75 గజాల లోపు స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. 76 గజాల నుంచి 600 గజాల ఇంటి స్థలం ఉన్నవారు ఆన్‍‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఇంటి నిర్మాణం అనుమతులకు ఇలా…

ఇంటి నిర్మాణానికి 21 రోజుల్లో అనుమతి ఇస్తారు. ఎవరైనా అకారణంగా అనుమతి నిలుపుదల చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. భవన నిర్మాణ దరఖాస్తు అందిన వారం రోజుల్లో ఏమైనా లోపాలు ఉంటే ఆ వివరాలు యజమానికి తెలియజేయాలి. ఇంటి అనుమతి తీసుకుని ఆరు నెలల్లో నిర్మాణం ప్రారంభించకపోతే అనుమతి రద్దు అవుతుంది. అలాగే, అనుమతులు తీసుకున్న మూడేళ్లలో ఇంటి నిర్మాణం మొత్తం పూర్తి చేయాలి.

అలాంటి అధికారిపై చర్యలు

అలాంటి అధికారిపై చర్యలు

అన్ని మున్సిపాలిటీల్లో ఈ-కార్యాలయ విధానం తీసుకు వచ్చి, దరఖాస్తు ఎన్ని రోజులు ఎక్కడ, ఎవరి దగ్గర పెండింగులో ఉందో ప్రభుత్వం తెలుసుకోనుంది. ఎలక్ట్రానిక్ ఆఫీస్ వ్యవస్థ ద్వారా ఎవరైనా కావాలని అనుమతి నిలుపుదల చేస్తే సదరు అధికారిపై చర్యలు తీసుకుంటారు.

ఇళ్ల డిజైన్లలో జాగ్రత్తలు...

ఇళ్ల డిజైన్లలో జాగ్రత్తలు…

ఆదివారం మండలిలో తెలంగాణ మున్సిపల్ సవరణ బిల్లు 2019 ప్రవేశ పెట్టారు. కొత్త మున్సిపల్ చట్టానికి తెలంగాణ శాసన సభ ఆమోదించిన నేపథ్యంలో ఈ చట్టానికి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇంటి అనుమతులు సక్రమంగా కొనసాగేందుకు వీలుగా జిల్లాకు ఒకటి చొప్పున లే-అవుట్ అప్రూవల్ కమిటీ అమలులోకి వస్తుంది. ఇళ్ల డిజైన్లలో జాగ్రత్తలు వహించని ఇంజినీర్లు, ఎల్టీపీలపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు ఉన్నాయి.

రియాల్టర్లకు స్థలం

రియాల్టర్లకు స్థలం

నగరాలు, పట్టణాల్లోని వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, హాస్టల్స్, హోటల్స్, ప్రార్థనాలయాలు, హాస్పిటల్స్, సినిమా థియేటర్లు, రెస్టారెంట్స్ ఏడాదిలోపు అగ్నిప్రమాదాలను నిరోధించడానికి పటిష్ఠ చర్యలను చేపట్టాలి. మున్సిపాలిటీల్లో లే-అవుట్లకు అనుమతినిచ్చే ప్రక్రియను సక్రమ పద్ధతిలో నిర్వహించడానికి కలెక్టర్ అధ్యక్షతన జిల్లాకు ఒక లే-అవుట్‌ అప్రూవల్ కమిటీని ప్రభుత్వం నియమిస్తుంది. కొత్త లే-అవుట్లలో ఘనవ్యర్థాల నిర్వహణకు ఇకపై తప్పనిసరిగా కొంత స్థలాన్ని రియల్టర్లు కేటాయించాలి.

అక్రమ నిర్మాణాలకు షాక్

అక్రమ నిర్మాణాలకు షాక్

అదే విధంగా నగరాలు, పట్టణాల్లో అక్రమ నిర్మాణాల నిరోధానికి కూడా పటిష్ట చర్యలను కొత్త చట్టంలో పొందుపరిచారు. మాస్టర్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా లేదా అనుమతులకు వ్యతిరేకంగా ఎవరైనా నిర్మాణాలు చేపడితే మూడేళ్ల జైలు శిక్ష. అంతేకాకుండా ఆ స్థలం విలువలో పావు శాతం వరకు గరిష్టంగా యాభై శాతం వరకు జరిమానా విధిస్తారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి వాటి వ్యర్థాల్ని తొలగించేందుకు అయ్యే ఖర్చును కూడా యజమాని నుంచి వసూలు చేస్తారు.

పార్కింగ్ స్థలాన్ని వేరే అవసరాలకు కేటాయిస్తే...

పార్కింగ్ స్థలాన్ని వేరే అవసరాలకు కేటాయిస్తే…

పార్కింగ్ స్థలం కోసం కేటాయించిన స్థలాన్ని ఇతర అవసరాలకు వినియోగిస్తే భవన యజమానులు లేదా డెవలపర్లు 25 శాతం నుంచి యాభై శాతం వరకు జరిమానాకు అర్హులు. చిన్న ఇల్లయినా పెద్ద అపార్టుమెంట్ అయినా నిబంధనలకు విరుద్ధంగా డిజైన్లు రూపొందిస్తే ఆర్కిటెక్స్, ఇంజినీర్స్ లైసెన్స్ రద్దవుతాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here