8నెలల కనిష్టస్థాయికి దిగజారిన రూపాయి: డాలర్‌తో 70.50కి పతనం

0
3


8నెలల కనిష్టస్థాయికి దిగజారిన రూపాయి: డాలర్‌తో 70.50కి పతనం

ముంబై: డాలర్‌తో ఇండియన్ రూపాయి విలువ సోమవారం పడిపోయింది. గ్లోబల్ ఈక్విటీ, కరెన్సీ మార్కెట్ గందరగోళం నేపథ్యంలో రూపాయి నష్టాన్ని చవిచూసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.60కి పడిపోయింది. అంతకుముందు వారం 69.60 వద్ద క్లోజ్ అయింది. డిసెంబర్ 2018 తర్వాత రూపాయి విలువ ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి.

భారీగా పడిపోయిన రూపాయి విలువ

చైనా కరెన్సీ యువాన్ ఈ రోజు ఏడు డాలర్ల స్థాయికి మించి పడిపోయింది. దశాబ్దంలో ఇలా పడిపోవడం ఇది తొలిసారి. భారత రూపాయి మాత్రం దాదాపు ఒక రూపాయి పడిపోయింది. గత వారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 71 పైసలు నష్టపోయింది. ఈ ఏడాది మే 17వ తేదీ తర్వాత రూపాయి కనిష్టస్థాయికి పడిపోవడం ఇదే. ఈ రోజు అయితే ఆరు నెలల కాలానికి దిగజారిపోయింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి కాస్త కోలుకుంటుందని భావిస్తున్నారు.

పెరుగుతున్న బంగారం ధరలు...

పెరుగుతున్న బంగారం ధరలు…

మధ్యాహ్నం వరకు స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో కొనసాగాయి. ఆసియా మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి. అమెరికా – చైనా వాణిజ్య యుద్ధం, కాశ్మీర్ టెన్షన్ వాతావరణం సహా పలు కారణాలు ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు మార్కెట్లో ఆరేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ఫ్యూచర్ గోల్డ్ భారత్‌లో కూడా రికార్డ్ స్థాయికి చేరుకుంది.

అలా దెబ్బపడింది..

అలా దెబ్బపడింది..

భారతీయ మార్కెట్ల నుంచి FPIలు ఉపసంహరించుకుంటున్నారు. మన మార్కెట్ల నుంచి నిధులు వెళ్లిపోవడం కూడా రూపాయిని దెబ్బతీస్తుంది. అయితే ఈక్విటీలలో దేశీయ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌తో పాటు ఫారన్ పోర్ట్‌పోలిటే ఇన్వెస్టర్ల పన్ను అంశాలను పరిశీలిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీందో సోమవారం మార్కెట్లు ఉత్సాహంగా ఉంటాయనుకున్నప్పటికీ, అమెరికా – చైనా ట్రేడ్ వార్, కాశ్మీర్ పరిస్థితులు అదే పరిస్థితిని తీసుకు వచ్చాయి.

మొదటి రెండు సెషన్లలో FPIలు వెనక్కి ఇలా..

మొదటి రెండు సెషన్లలో FPIలు వెనక్కి ఇలా..

ఫారన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు (FPI) ఈ నెలలో మొదటి రెండు ట్రేడింగ్ సెషన్లలో ఈక్విటీల నుంచి రూ.2,632.58 కోట్లు, డెబిట్ సెగ్మెంట్ నుంచి రూ.248.52 కోట్లు వెనక్కి తీసుకున్నారు. చైనా 7.00 మార్క్‌తో ఆసియా మార్కెట్‌ను ఆందోళనకు గురి చేసింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here